తొందరపాటు చర్యలొద్దు, స్టే పొడిగింపు: సీఐడీకి ఏపీ హైకోర్టు ఆదేశం

By narsimha lodeFirst Published May 7, 2021, 12:00 PM IST
Highlights

మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుపై తొందరపాటు చర్యలు వద్దని ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. 

అమరావతి: మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుపై తొందరపాటు చర్యలు వద్దని ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో జారీ చేసిన స్టే ఆదేశాలను ఈ ఏడాది జూన్ 17వ తేదీ వరకు హైకోర్టు పొడిగించింది.  దేవినేనిని విచారించేందుకు గుంటూరు సీఐడీ డీఎస్పీకి హైకోర్టు అనుమతి ఇచ్చింది.  ఏపీ సీఎం వైఎస్ జగన్  వీడియోను మార్పింగ్ చేసి మీడియా సమావేశంలో ప్రదర్శించారని కర్నూల్ న్యాయవాది సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు సీఐడీ దేవినేని ఉమాపై  కేసు నమోదు చేసింది. 

also read:దేవినేని ఉమకు మరోసారి సిఐడి నోటీసులు

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీకి చెందిన కీలక నేతలపై కేసులు నమోదౌతున్నాయి. తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకొని  వైసీపీ సర్కార్ తప్పుడు కేసులు బనాయిస్తోందని చంద్రబాబునాయుడు పదే పదే ఆరోపిస్తున్నారు. తప్పుడు కేసులతో తమ నేతలను జైళ్లకు పంపుతున్నారని ఆయన విమర్శిస్తున్నారు. ఇప్పటికే అచ్చెన్నాయుడు, కొల్లురవీంద్ర, దూళిపాళ్ల నరేంద్రలు జైలుకు వెళ్లారు. పలువురు నేతలపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. 

click me!