సంచయిత, ఏపీ సర్కార్‌కి హైకోర్టు షాక్: మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మెన్ బాధ్యతలు ఆశోక్‌కే

Published : Aug 11, 2021, 04:03 PM ISTUpdated : Aug 11, 2021, 04:10 PM IST
సంచయిత, ఏపీ సర్కార్‌కి హైకోర్టు షాక్: మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మెన్ బాధ్యతలు ఆశోక్‌కే

సారాంశం

మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మెన్ గా మాజీ కేంద్ర మంత్రి ఆశోక్‌గజపతిరాజు కొనసాగింపునకే ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.ఏపీ ప్రభుత్వంతో పాటు సంచయిత గజపతిరాజు పిటిషన్లను ఏపీ హైకోర్టు డివిజన్ బెంచీ కొట్టివేసింది.ఈ విషయమై దాఖలైన అనుబంధ పిటిషన్లను కూడ హైకోర్టు తోసిపుచ్చింది.ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశోక్‌గజపతిరాజును చైర్మెన్ పదవి నుండి తప్పించారు

అమరావతి:మాన్సాస్ ట్రస్ట్ వారసత్వంపై ఏపీ హైకోర్టు బుధవారం నాడు  కీలక ఆదేశాలు ఇచ్చింది. మాజీ కేంద్ర మంత్రి ఆశోక్‌గజపతిరాజును మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మెన్‌గా కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మెన్ గా ఆశోక్‌గజపతిరాజు ఛైర్మెన్ గా నియామకాన్ని సవాల్ చేస్తూ సంచయిత గజపతిరాజు హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు.ఈ పిటిషన్ పై డివిజన్ బెంచ్ ఇవాళ విచారణ నిర్వహించింది. 

అశోక్ గజాపతిరాజును మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా తిరిగి నియమిస్తూ సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేయాలని హైకోర్టుని కోరిన ప్రభుత్వంతో  సంచయిత గజపతిరాజు కోరారు. సంచయితను ట్రస్ట్ చైర్మన్ గా నియమిస్తూ ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రభుత్వం తరుపు న్యాయవాది వాదనలు విన్పించారు.  మాన్సాస్ ట్రస్ట్ విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఈ విషయమై దాఖలైన అనుబంధ పిటిషన్లను కూడ ఏపీ హైకోర్టు కొట్టివేసింది.

also reaమాన్సాస్ వివాదం: కుటుంబ వ్యవహారంలో ప్రభుత్వ జోక్యమెంటీ.. ఊర్మిళ పిటిషన్‌పై అశోక్ స్పందన d:

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాన్సాస్ ట్రస్ట్ చైర్మెన్ గా ఆశోక్ గజపతిరాజును తప్పించి సంచయిత గజపతిరాజును నియమించారు. ఈ నియామకాన్ని సవాల్ చేస్తూ ఆశోక్‌గజపతిరాజు ఏపీ హైకోర్టులో పిటిసన్ దాఖలు చేశారు.  ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన  హైకోర్టు ఈ ఏడాది జూన్ 17న ఆశోక్ గజపతిరాజును ఛైర్మెన్ గా నియామకానికి ఆదేశాలు జారీ చేసింది.
 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!