ఎల్జీ కంపెనీ డైరెక్టర్ల పాస్‌పోర్టులు సరెండర్: ఎల్జీ ప్రమాదంపై హైకోర్టులో విచారణ

By narsimha lodeFirst Published May 22, 2020, 4:51 PM IST
Highlights

ఎల్జీ పాలీమర్స్ లో స్టెరిన్ గ్యాస్ లీకైన ఘటనలో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎల్జీ పాలీమర్స్ ఘటనపై శుక్రవారం నాడు హైకోర్టు విచారించింది.


అమరావతి:ఎల్జీ పాలీమర్స్ లో స్టెరిన్ గ్యాస్ లీకైన ఘటనలో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎల్జీ పాలీమర్స్ ఘటనపై శుక్రవారం నాడు హైకోర్టు విచారించింది.

కంపెనీ డైరెక్టర్లు విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనతో కంపెనీ తరపు న్యాయవాది మాత్రం విబేధించారు. కంపెనీ డైరెక్టర్ల పాస్‌పోర్టులు సరెండర్ చేశామని హైకోర్టు కు కంపెనీ తరపు న్యాయవాది తెలిపారు.

also read:ఎల్జీ పాలీమర్స్‌కు కాంగ్రెస్, వైసీపీ అనుమతులు, ఇవిగో ఆధారాలు: జగన్ కు బాబు సవాల్

గ్యాస్ లీకైన ట్యాంకర్ మినహా ఇతర ట్యాంకర్లను దక్షిణ కొరియాకు తరలించామని హైకోర్టుకు ఎల్జీ పాలీమర్స్ నివేదిక ఇచ్చింది. నేషనల్ గ్యాస్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రూ. 50 కోట్లను జిల్లా కలెక్టర్ వద్ద డిపాజిట్ చేసినట్టుగా తెలిపారు.

ఏదో ఒక సంస్థతో విచారణ జరిపించాలని ఎల్జీ పాలీమర్స్ సంస్థ హైకోర్టును కోరింది. ఈ పిటిషన్ పై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది హైకోర్టు.

ఈ నెల 7వ తేదీన ఎల్జీ పాలీమర్స్ పరిశ్రమలో స్టెరిన్ గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. మృతుల కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం  కోటి రూపాయాలను పరిహారంగా చెల్లించింది.

click me!