అమరావతి రైతులకు ఊరట... హైకోర్టులో జగన్ సర్కార్ కు చుక్కెదురు

By Arun Kumar P  |  First Published Sep 1, 2021, 1:10 PM IST

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో మరోసారి చుక్కెదురయ్యింది. ప్రభుత్వం అమరావతి అసైన్డ్ రైతుల ప్లాట్ల విషయంలో తీసుకున్న నిర్ణయంపై చర్యలు నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. 


అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురయ్యింది. రాష్ట్ర రాజధాని అమరావతిలో అసైన్డ్ రైతుల విషయంలో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు జరక్కుండా నిలిపివేసింది ఏపీ హైకోర్టు.  

గత టిడిపి ప్రభుత్వం రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన అసైన్డ్ రైతులకు ప్లాట్లు ఇచ్చింది. ఈ రిటర్నబుల్ ప్లాట్లను వెనక్కి తీసుకుంటూ వైసిపి సర్కార్ జారీ జీవో-316 జారీ చేసింది. ఈ జీవోపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా వాదోపవాదాలు విన్న న్యాయస్థానం ఈ జీవో అమలుపై తీసుకుంటున్న చర్యలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఊరట లభించింది.  

Latest Videos

undefined

read more  జగన్ సర్కార్‌కి హైకోర్టు షాక్: సంగం డెయిరీపై ఏపీ ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత

అమరావతి నిర్మాణంలో భాగంగా జరిగిన భూసమీకరణలో అసైన్డ్ భూములను కోల్పోయిన రైతులకు  గత టిడిపి ప్రభుత్వం ప్లాట్లను ఇచ్చింది. ఇందుకోసం జీవో నంబర్ 41ను విడుదలచేసింది. భూములను కోల్పోయిన అసైన్డ్ రైతులు అవసరాల కోసం ఆ ప్లాట్లను విక్రయించుకునే వెసులుబాటు కూడా కల్పించింది చంద్రబాబు సర్కార్. 

అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిబంధనలకు విరుద్దంగా అసైన్డ్ భూము లావాదేవీలు జరిగాయంటూ రిటర్నబుల్ ప్లాట్లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా జీవో నంబర్ 41ను రద్దు చేస్తూ జీవో నంబర్ 316ను జారీ చేసింది. దీంతో ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ అసైన్డ్ రైతులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపైనే ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి చర్యలు నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.  

click me!