మాజీ మంత్రి నారాయణ ఇంట విషాదం

Published : Apr 23, 2020, 12:32 PM IST
మాజీ మంత్రి నారాయణ ఇంట విషాదం

సారాంశం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీకి చెందిన నేతలు, పలువురు ప్రముఖులు నారాయణకు ఫోన్ చేసి పరామర్శించారు. కాగా రేపు సుబ్బమ్మ అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ ఇంట విషాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం నారాయణకు మాతృ వియోగం కలిగింది. నారాయణ తల్లి పొంగూరు సుబ్బమ్మ కన్నుమూశారు.సుబ్బమ్మ వయస్సు 85 సంవత్సరాలు. ఆమెకు ఇద్దరు కుమారులు.. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీకి చెందిన నేతలు, పలువురు ప్రముఖులు నారాయణకు ఫోన్ చేసి పరామర్శించారు. కాగా రేపు సుబ్బమ్మ అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా.. సుబ్బమ్మ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

సుబ్బమ్మ భర్త బస్సు కండెక్టర్ గా పనిచేశారు. చాలా నిరుపేద కుటుంబం అయినప్పటికీ పిల్లల్ని‌బాగా చదువుకోమని‌ ప్రోత్సహించారు. ఎవరైనా కష్టంలో ఉన్నామని చెబితే చలించిపోయేవారు. పిల్లలకి చెప్పి సాయం చేయించేవారు. సొంతూరైన తోటపల్లిగూడూరు అంటే ప్రాణం. ఆరోగ్యం సహకరించకున్నా ఊరికి వెళ్లి వస్తుండేవారు. 

ఊరిలో వారందరి గురంచి అడిగి తెలుసుకునే వారు. నారాయణ ఎదుగుదలలో ఆమెది కీలకపాత్ర. నారాయణ చిన్నప్పుడు‌ పదవ తరగతి పాస్ మార్కులతో పాసయ్యారు. అప్పుడు ఆమె చెప్పిన మాటలతో కష్టపడి‌ చదవడం‌ మొదలెట్టారు. డిగ్రీ, పీజీలో గోల్డ్ మెడలిస్ట్. తాను చదువుకున్న వీఆర్సీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ అయ్యారు. తొలి సంపాదన తల్లికి ఇచ్చినప్పుడు‌ ఆమె సంతోషం అంతా ఇంతా కాదు. 

పిల్లలు ఎవరు కనిపించినా బాగా చదువుకోమని చెప్పేవారు. ఎంత జ్ఞానం పొందినా, ఇంకా ఇంకా తెలుసుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి ఉంటాయని అనేవారు. కొన్నేళ్ల కిందట నారాయణ కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం ఆమెని బాగా కృంగదీసింది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం