వికేంద్రీకరణ బిల్లులు పాసైన తర్వాతే విశాఖకు రాజధాని: హైకోర్టుకు తెలిపిన ఏజీ

By narsimha lodeFirst Published Apr 24, 2020, 12:46 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుండి విశాఖ తరలింపును  వికేంద్రీకరణ బిల్లులు పాసైన తర్వాతే చేపడుతామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఏపీ ప్రభుత్వంతో పాటు, కేంద్రం కూడ అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు శుక్రవారం నాడు కోరింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుండి విశాఖ తరలింపును  వికేంద్రీకరణ బిల్లులు పాసైన తర్వాతే చేపడుతామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఏపీ ప్రభుత్వంతో పాటు, కేంద్రం కూడ అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు శుక్రవారం నాడు కోరింది.

అమరావతి తరలింపు విషయమై అమరావతి పరిరక్షణ సమితి జేఎసీ నేతలు దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం నాడు హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. అమరావతిలో ఉన్న రాజధానిని విశాఖకు తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

వీకేంద్రీకరణ బిల్లులు పాస్ కాకుండా రాజధానిని విశాఖకు తరలించబోమని ఏజీ హైకోర్టుకు స్పష్టం చేశారు. అయితే ఇదే అంశంతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. 

also read:వలసకూలీలకు రూ. 10వేలు, వసతి కల్పించాలి: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

అఫిడవిట్ దాఖలు చేయడానికి పది రోజుల సమయం కావాలని కోర్టును ఏజీ కోరారు. ఇందుకు హైకోర్టు సానుకూలంగా స్పందించింది. 
పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై కేంద్రం కూడ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు కోరింది. పది రోజుల్లోనే ఈ అఫిడవిట్ వేయాలని సూచించింది. 

అమరావతి నుండి రాజధానిని విశాఖకు తరలించే ప్రక్రియను ఆపడం ఎవరి తరం కాదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడ పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై  అడ్వకేట్ జనరల్ వివరణ కోరింది హైకోర్టు.

click me!