టీడీపీకి ఊరట.. అభ్యర్థులకు పోలీసులతో రక్షణ ఇవ్వండి.. డీజీపీకి హైకోర్టు ఆదేశం

By telugu teamFirst Published Nov 10, 2021, 5:52 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. గురజాల, దాచేపల్లి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు రక్షణ కల్పించాలని డీజీపీ గౌతం సవాంగ్‌ను ఆదేశించింది. అంతేకాదు, ఎన్నికల తీరును వెబ్ క్యాస్టింగ్ ద్వారా అధికారులు పర్యవేక్షించే విధంగా టెలికాస్ట్ చేయాలని ఎస్‌ఈసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
 

అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో TDPకి ఊరట లభించింది. గురజాల, దాచేపల్లి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు, పోలింగ్ బూత్, ఓటర్లకూ పోలీసులతో పూర్తి స్థాయి భద్రత కల్పించాలని High Court.. Andhra Pradesh డీజీపీ గౌతం సవాంగ్‌ను ఆదేశించింది. అదనపు బలగాలను మోహరించాలని, పూర్తిస్థాయి భద్రతను అందించాలని స్పష్టం చేసింది. అంతేకాదు, ఎన్నికల తీరును Web Casting ద్వారా అధికారులు పర్యవేక్షించే విధంగా టెలికాస్ట్ చేయాలని ఎస్‌ఈసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

అధికార వైసీపీ పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని టీడీపీ అభ్యర్థులు పలుసార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతల బెదిరింపులు, అధికారుల తీరును నిరసిస్తూ వారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల తీరును వెబ్ క్యాస్టింగ్ ద్వారా టెలికాస్ట్ చేయాలని కోరారు. టీడీపీ అభ్యర్థులు, ఓటర్లకు రక్షణ క్పలించాలని పిటిషన్ వేశారు. వీరి తరఫున హైకోర్టు న్యాయవాదులు నర్రా శ్రీనివాస్, ముప్పాల బాలకృష్ణ వాదించారు. వీరి వాదనలు విన్న తర్వా హైకోర్టు ఆదేశాలు వెలువరించింది.

Also Read: ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ల ఉపసంహరణ: నీలం సహానీకి బాబు ఫోన్

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 498 గ్రామ పంచాయతీలు, 12 మున్సిపాలిటీలు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌ ,533 వార్డు సభ్యులకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, బుచ్చిరెడ్డిపాలెం, కుప్పం, బేతంచెర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

రాష్ట్రంలోని 12 మున్సిపాలిటీల్లో కుప్పం మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటీవలనే కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబునాయుడు రెండు రోజులు పర్యటించారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపారు. గతంలో ఫిర్యాదు చేసిన నేతలను ఈ టూర్ లో చంద్రబాబునాయుడు దూరంగా ఉంచారు. ఈ టూర్ ప్రభావం ఈ ఎన్నికలపై ఉంటుందో లేదో అనేది ఎన్నికల పలితాలు తేల్చనున్నాయి. 

Also Read: Kuppam Election:చంద్రబాబు ఇలాకాలో ఉద్రిక్తత... మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, చిత్తూరు టిడిపి చీఫ్ అరెస్ట్

ఈ నెల 14న గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. మున్సిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్ లలో నవంబర్ 15న పోలింగ్ నిర్వహించి ఈ నెల 17న ఫలితాలు ప్రకటిస్తారు. గతంలో రద్దయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నవంబర్ 16న పోలింగ్ నిర్వహించి నవంబర్ 18న ఫలితాలు వెల్లడిస్తారు.

click me!