అయోధ్యలో స్థలం కాావాలని అడిగాం... ఎందుకోసమంటే...: టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి

By Arun Kumar PFirst Published Nov 10, 2021, 5:29 PM IST
Highlights

ఢిల్లీలోని టీటీడీ ఆలయ సలహా మండలి చైర్ పర్సన్ గా వేమిరెడ్డి ప్రశాంతి బాధ్యతా స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

తిరుపతి: ఉత్తరాదిలోనూ పెద్దఎత్తున హిందూ ధర్మ ప్రచారం నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. జమ్మూలో టీటీడీ నిర్మించనున్న శ్రీవారి ఆలయ నిర్మాణం ఏడాదిన్నలో పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేసారు.

ఢిల్లీలోని టీటీడీ ఆలయ సలహా మండలి చైర్ పర్సన్ గా వేమిరెడ్డి ప్రశాంతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరికి ఆలయ అర్చకులు సంప్రదాయ బద్దంగా స్వాగతం పలికారు. 

vemireddy prashanthi బాధ్యతల స్వీకరణ కార్యక్రమం అనంతరం yv subbareddy మాట్లాడుతూ.... ఉత్తరాదిలో ఆలయాల విస్తరణకు ఢిల్లీ సలహామండలి కృషి చేస్తుందని చెప్పారు. ఢిల్లీ, కురుక్షేత్ర సహా పలుచోట్ల టీటీడీకి ఆలయాలున్నాయని TTD Chairman గుర్తుచేసారు.

read more  ఆన్లైన్ లోనే సర్వదర్శనం టోకెన్లు... శ్రీవారి భక్తులకు టిటిడి ఛైర్మన్ శుభవార్త

ఇక జమ్ములో ఆలయ నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపన చేశామని.... 18 నెలల్లో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేసారు. టీటీడీకి అయోధ్యలో స్థలం కేటాయించాలని రామజన్మభూమి ఆలయ  కమిటీని కోరామని చెప్పారు. ayodhya ఆలయ నిర్మాణ కమిటీ నుంచి వచ్చే స్పందన మేరకు అక్కడ ఆలయం లేదా భజనమందిరం నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామన్నారు వైవి సుబ్బారెడ్డి.

గోఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా పాలక మండలి నిర్ణయం తీసుకుందని టిటిడి ఛైర్మన్ వెల్లడించారు. ఇందుకోసం ముఖ్యమంత్రి ys jaganmohan reddy సమక్షంలో ఏపి రైతు సాధికారిక సంస్థతో ఎంఓయు చేసుకున్నట్లు సుబ్బారెడ్డి వివరించారు.గోఆధారిత వ్యవసాయంతో పండించిన పంటలను రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి టీటీడీ  కొనుగోలు చేస్తుందన్నారు. ఇకపై తిరుమల శ్రీవారి ప్రసాదాలు, నిత్యాన్నదానంతో పాటు టీటీడీ అవసరాలకు గో ఆధారిత ఉత్పత్తులను సేకరిస్తామని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. 

ఢిల్లీ శ్రీవారి ఆలయంలో జరిగిన గోపూజ కార్యక్రమంలో సుబ్బారెడ్డి, ప్రశాంతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభసభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ చెన్నై సలహా మండలి సభ్యులు శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదిలావుంటే ఇటీవల టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర విశ్వవిద్యాలయంగా నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయాన్ని జాతీయ వేద విశ్వవిద్యాలయంగా ప్రకటించాలని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్‌ను కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రిని కలసి వినతిపత్రం అందజేశారు.

2006లో టీటీడీ నేతృత్వంలో వేద విద్య వ్యాప్తి, పరిరక్షణ కోసం శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయంగా ప్రారంభించారు. 2007లో యూజీసీ దీనిని రాష్ట్ర విశ్వవిద్యాలయంగా గుర్తించిందని చైర్మన్ వివరించారు. ఈ వర్శిటీ వేదాల్లో డిగ్రీ నుంచి పిహెచ్‌డి దాకా అనేక కోర్సులు నడుపుతోందని వైవీ తెలిపారు. అలాగే వేద విద్యను ప్రోత్సహించడానికి టీటీడీ సొంతంగా వేద పాఠశాలలు నడపడంతో పాటు, దేశవ్యాప్తంగా 80 వేద గురుకులాలకు ఆర్థిక సహాయం అందిస్తోందని సుబ్బారెడ్డి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

వేదం చదివిన వారిని ఆదుకోవడానికి ఆలయాల్లో వేద పారాయణం, పెన్షన్, అగ్నిహోత్రం ఆర్థిక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. 14 సంవత్సరాలుగా టీటీడీ నిర్వహిస్తున్న వేద విశ్వవిద్యాలయానికి యూజీసీ 2ఎఫ్ గుర్తింపు ఇచ్చిందనీ, ఇప్పుడు 12బి కేటగిరీ గుర్తింపు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సుబ్బారెడ్డి.. రమేశ్‌ను కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మూడు విద్యాసంస్థలకు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాల హోదా ఇచ్చిన విధంగా, ఎస్. వి వేద విశ్వవిద్యాలయానికి జాతీయ వేద విశ్వ విద్యాలయం హోదా ప్రకటిస్తే దేశంలో తొలి వేద విశ్వవిద్యాలయంగా గుర్తింపు లభిస్తుందని టీటీడీ ఛైర్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

click me!