మద్యంపై వ్యాట్ సవరణ:ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు

By narsimha lode  |  First Published Nov 10, 2021, 5:01 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యంపై పన్ను రేట్లను  సవరిస్తూ నిర్ణయం తీసుకొంది. వ్యాట్ ను సవరించింది ఈ మేరకు బుధవారం నాడు జీవోను జారీ చేసింది.


అమరావతి: మద్యంపై పన్ను రేట్లను సవరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నాడు నిర్ణయం తీసుకొంది. వ్యాట్‌లో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఏపీలో తయారైన విదేశీ మద్యం బ్రాండ్లపై ధర ఆధారంగా పన్నుల్లో మార్పులు చేసింది.రూ.400 లోపు ఉన్న మద్యం బ్రాండ్లపై 50 శాతం, రూ.400 నుండి రూ.2500 వరకు ఉన్న మద్యం కేసుపై 60 శాతం వ్యాట్ విధించనున్నారు. రూ.2000 నుండి రూ. 3500 వరకు ఉన్న మద్యం కేసుపై 55 శాతం, రూ.5000లకు పైగా ఉన్న మద్యం కేసులపై 45 శాతం వ్యాట్ విధించారు.

మరో వైపు దేశీయ బీరు కేసులపై కూడా వ్యాట్ ను సవరించారు. రూ. 200 కంటే తక్కువ ఉన్న బ్రాండ్లపై 50 శాతం వ్యాట్, రూ. 200 కంటే ఎక్కువ ధర ఉన్న బీర్ కేసుపై 60 శాతం వ్యాట్ విధించారు.అన్నిరకాల మద్యంపై 35 శాతం వ్యాట్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే రెడీ టూ డ్రింక్‌ వెరైటీలపై కూడా 50 శాతం వ్యాట్‌ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Latest Videos

undefined

రాష్ట్రంలో దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని Ycp హామీ ఇచ్చింది.ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి గత tdp ప్రభుత్వంలో వేలం పాటల ద్వారా ప్రైవేటు వ్యక్తులు పాడుకున్న షాపులు కొనసాగుతున్నాయి. వీటిలో చాలా మటుకు టీడీపీ నేతల చేతుల్లోనే ఉన్నాయి. దీంతో వీరికి అడ్డుకట్ట వేసేందుకు మద్యం షాపుల్ని ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవడం మొదలుపెట్టింది. అంతే కాదు వాటిని కూడా దశలవారీగా తొలగిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అన్నట్లుగానే తొలి ఏడాది 20 శాతం మేర షాపుల్ని ప్రభుత్వం తొలగించింది. 

వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక  కొత్త కొత్త బ్రాండ్లు పుట్టుకొచ్చాయి.  వీటి ధరలు కూడా మోతమోగడం మొదలైంది. అదేమని అడిగితే ప్రభుత్వం మద్యం అమ్మకాల్ని నిరుత్సాహ పరిచే ఉద్దేశంతోనే ధరలను పెంచినట్టుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

also read:తెలంగాణ.. వైన్స్ కేటాయింపులపై మార్గదర్శకాలు విడుదల.. తొలుత లాటరీ వాళ్లకే..

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు అధికంగా ఉండటంతో మద్యం ప్రియులు సరిహద్దుకు దగ్గరగా ఉన్న వేరే రాష్ట్రాలను ఆశ్రయిస్తున్నారు..అడ్డదారిలో ఇప్పుడే లక్షలు సంపాదించుకోవచ్చన్న దుర్భుద్దితో చాలా మంది దళారి వ్యాపారులు అక్రమంగా వేరే రాష్ట్రాల నుంచి భారీగా మద్యం బాటిళ్ల ను ఏపీకి తరలిస్తూ పట్టుబడ్డారు. ఈ విషయమై హైకోర్టు కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతోఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని తీసుకువచ్చే వ్యక్తులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. 

మద్యం షాపులు తగ్గినా ధరలు పెరగడంతో మద్యం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగానే ఆదాయం లభించింద. మద్య నిషేధం విధిస్తామని ఇచ్చిన హామీని వైసీపీ సర్కార్ అమలు చేయడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. 


 

click me!