
కృష్ణా జిల్లా మాజీ కలెక్టర్ ఇంతియాజ్, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌కు హైకోర్టు వారెంట్లు జారీ చేసింది. వారెంట్లను అమలు చేయాలని విజయవాడ సీపీకి హైకోర్టు ఆదేశాలిచ్చింది. కృష్ణా జిల్లా నందిగామలో 20 మంది అర్హులకు.. జగనన్న చేయూత పథకం అమలు చేయకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గ్రామ సభలో ఆమోదించిన తర్వాత కూడా పథకం అమలు చేయకుండా.. నిర్లక్ష్యం వహించారని న్యాయవాది ప్రభాకర్ పిటిషన్ వేశారు.