విశాఖ కాలుష్యంపై... ప్రభుత్వానికి హైకోర్టుకు కీలక ఆదేశాలు

By Arun Kumar PFirst Published Sep 24, 2020, 1:05 PM IST
Highlights

విశాఖలో కాలుష్య నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

అమరావతి: విశాఖపట్నంలో వెలిసిన ఫార్మా కంపెనీల వల్ల సముద్రం కలుషితం అవుతోందని... దీనిపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. కాలుష్య నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రభుత్వం దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ హైకోర్టు నవంబర్ 6కి వాయిదా వేసింది. 

విశాఖలో కలకలం సృష్టించిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో కొందరు రోడ్డుపైనే మృతి చెందగా, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇలా ఇప్పటివరకు ఈ ప్రమాదం కారణంగా 14 మంది మృతిచెందారు. 

గోపాలపట్నం పరిధిలో గల ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకై దాదాపు 3 కిలోమీటర్ల మేర విస్తరించాయి.  ఆర్థరాత్రి దాటిన తర్వాత విషవాయువు లీకవడంతో మనుషులే కాదు మూగజీవులు కూడా దాని తీవ్రతకు గురై పడిపోతున్నాయి. మనుషులు అక్కడికక్కడే కుప్ప కూలిపోయిన హృదయవిదారక దృశ్యాలను కూడా కనిపించాయి.

ఈ ఘటన అనంతరం కూడా ఇలాంటి మరికొన్ని ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. దీంతో రాష్ట్రంలోని ఇలాంటి ప్రమాదకర కంపనీలు, వాటివల్ల వెలువడుతున్న కాలుష్యంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన మొదలయ్యింది. మరీ ముఖ్యంగా విశాఖ చుట్టుపక్కల ఇబ్బడిముబ్బడిగా ఫార్మా కంపనీలు వెలుస్తూ వాయు కాలుష్యాన్నే కాదు సముద్ర నీటిని కూడా కలుషితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాలుష్యం నుండి విశాఖ నగరాన్ని కాపాడాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. 


 

click me!