మధ్యంతర ఉత్తర్వులు కొనసాగింపు... జగన్ సర్కార్ కు ఏపీ హైకోర్టు షాక్

By Arun Kumar PFirst Published Nov 25, 2020, 3:50 PM IST
Highlights

మిషన్ బిల్డ్, ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలను నిరసిస్తూ గుంటూరుకు చెందిన సురేష్ బాబు దాఖలు చేసిన పిల్ పై  హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. 

అమరావతి: మిషన్ బిల్డ్, ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలపై మధ్యంతర ఉత్తర్వులను కొనసాగిస్తున్నట్టుగా ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. మిషన్ బిల్డ్, ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలను సవాల్ చేస్తూ దాఖలైన పిల్ పై  హైకోర్టులో బుధవారం విచారించింది. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం తరపున కౌంటర్లు పిటిషనర్లకు అందలేదని.. అందుచేత విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. తుది తీర్పునకు లోబడే ఆక్షన్ ఉండాలని గతంలో ఇచ్చిన.. మధ్యంతర ఉత్తర్వులు కేసు తదుపరి ఆదేశాల వరకు కొనసాగింపు ఉంటుందని పేర్కొంది. 

మిషన్ బిల్డ్, ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలను నిరసిస్తూ గుంటూరుకు చెందిన సురేష్ బాబు సహా పలువురు పిల్ ను హైకోర్టులో  దాఖలు చేశారు.  పిటిషనర్ తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఈ పిల్ పై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొనసాగిస్తూ కొర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పు వచ్చేవరకు టెండర్లు ఖరారు చేయవద్దని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.  

read more  మిషన్ బిల్డ్ పేరుతో ప్రభుత్వ భూముల లూటీ: వైసీపీపై దూళిపాళ నరేంద్ర

ఆదాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములను విక్రయించాలని నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ఏపీ బిల్డ్  మిషన్ ను ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వ భూముల విక్రయించాలని జగన్ సర్కార్ తీసుకొన్న నిర్ణయాన్ని విపక్షాలు విమర్శించాయి.

click me!