గ్రామాల విలీనం కేసు: ఆ ఐదు జిల్లాల్లో ఎన్నికలకు ఏపీ హైకోర్టు బ్రేక్

Siva Kodati |  
Published : Aug 06, 2021, 02:33 PM IST
గ్రామాల విలీనం కేసు:  ఆ ఐదు జిల్లాల్లో ఎన్నికలకు ఏపీ హైకోర్టు బ్రేక్

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామాలను మున్సిపాలిటీలు, కార్పోరేషన్‌లలో కలుపుతూ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌పై శుక్రవారం రాష్ట్ర హైకోర్టు విచారణ జరిపింది. గుంటూరు, చిత్తూరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల నుంచి హైకోర్టులో 45 పిటిషన్లు దాఖలయ్యాయి.  

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామాలను మున్సిపాలిటీలు, కార్పోరేషన్‌లలో కలుపుతూ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌పై శుక్రవారం రాష్ట్ర హైకోర్టు విచారణ జరిపింది. గుంటూరు, చిత్తూరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల నుంచి హైకోర్టులో 45 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ సందర్భంగా స్పందించిన కోర్టు ఈ 5 జిల్లాల్లో 3 వారాల పాటు ఎన్నికలు నిర్వహించొద్దని ఆదేశించింది. ఆర్డినెన్స్‌ను  కాకుండా చట్టాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ ఫైల్ చేస్తామని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ఇప్పటికే పిటిషనర్లకు మున్సిపల్ చట్టం కాపీలను అందించారు ఏజీ. దీనిపై స్పందించిన కోర్టు పిటిషనర్లకు 3 వారాల సమయం ఇచ్చింది. ఈ ఐదు జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో ఎన్నికలు జరపొద్దని హైకోర్టు ఆదేశించింది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో చలివానలు... ఏపీలో ఎనిమిది, తెలంగాణలో 23 జిల్లాలకు అలర్ట్
Chitha Vijay Prathap Reddy: ఫుడ్ కమిషన్ చైర్మన్ కే పంచ్ లు నవ్వు ఆపుకోలేకపోయిన అధికారులు| Asianet