విజయవాడ మహిళపై దాష్టికం... ఆటో డ్రైవర్ అరెస్ట్ (వీడియో)

By Arun Kumar PFirst Published Aug 6, 2021, 2:27 PM IST
Highlights

ఇచ్చి అప్పు తీర్చమన్నందుకు ఓ మహిళపై ఆటో డ్రైవర్ అత్యంత పాశవికంగా దాడికి పాల్పడిన ఆటో డ్రైవర్ ను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

మంగళగిరి: ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో మహిళపై అత్యంత దారుణంగా దాడికి పాల్పడిన ఆటోడ్రైవర్ పోకల గోపీకృష్ణను మంగళగిరి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ ఎస్సై లోకేష్ వెల్లడించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

మహిళ దాడి ఘటనపై గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హాఫిజ్  స్పందించారు. సామాజిక మాధ్యమాల ద్వారా మహిళను ఆటో డ్రైవర్ కొట్టిన వీడియో తమ దృష్టికి వచ్చిందని... దీంతో వెంటనే స్పందించామన్నారు.  మహిళల భద్రత ప్రధాన అంశంగా భావించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితునిపై 354, 323, 506,  509 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. 

 వీడియో

వివరాల్లోకి వెళితే... తాడేపల్లి మహానాడులో కొంతకాలం జీవనం సాగించిన మహిళ ప్రస్తుతం విజయవాడ రాణిగారి తోటలో నివాసం ఉంటోంది. మహానాడులో ఉండగా తాపీ మేస్త్రిగా పనిచేసే చిర్రావురుకి చెందిన గోపి కృష్ణ అనే యువకుడికి 3 లక్షల రూపాయల నగదు వడ్డీకి ఇప్పించింది.

అప్పు తీర్చమన్నందుకు మహిళను ఎగిరి తన్నిన ఆటో డ్రైవర్ దాష్టీకం (వీడియో)

అయితే, తీసుకున్న అప్పు తీర్చమని అడుగుతుంటే గోపి కృష్ణ పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదు. దీంతో ఆ మహిళ ఆటో డ్రైవర్ కోసం చిర్రావూరు వచ్చి తీసుకున్న బాకీ తీర్చమని అడిగింది. జనసంచారం లేని కృష్ణ కరకట్టపై ఆమెతో చాలాసేపు గోపీకృష్ణ వాగ్వాదానికి దిగాడు. చివరికి ఒక్కసారిగా మహిళను ఎగిరి కాలితో తన్నాడు. దీంతో దెబ్బకు దూరంగా ఎగిరి పడి కుప్పకూలిపోయింది ఆ మహిళ. 

అప్పటికే మహిళతో వచ్చినవాళ్లు వీడియో తీస్తుండడంతో అది కూడా వీడియోలో పడింది. తేరుకున్న తరువాత ఆ మహిళ 100 కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా,  చికిత్స పొందుతుంది. ఈ ఘటన చిర్రావూరు, రామచంద్ర పురం గ్రామాల మధ్య చోటు చేసుకుంది.

click me!