ఎస్ఈసీగా నియామకం...నీలం సాహ్నికి, జగన్ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

By Siva KodatiFirst Published Jun 15, 2021, 4:37 PM IST
Highlights

ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్నికి ఏపీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది

ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్నికి ఏపీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వంతో పాటు ఎస్ఈసీ నీలం సాహ్ని, ఇతర ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. నిబంధనల  ప్రకారం నీలం సాహ్ని నియామకం జరగలేదని పిటిషనర్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న అనంతరం విచారణను ఈ నెల 29కి వాయిదా వేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఏపీ ఎస్ఈసీ)గా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో గత నెల 22న పిటిషన్ దాఖలైంది. ఏపీ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన స్థానంలో నీలం సాహ్నిని నియమించారు. ఆ పిటిషన్ మీద హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సమ్మర్ వెకేషన్ తర్వాత ఆ పిటిషన్ మీద హైకోర్టు విచారణ చేపడతామని తెలిపింది. 

Also Read:మీరోక ఎస్ఈసీ, సీఎస్‌గా చేశారు.. ఇంగ్లీష్ అర్థం చేసుకోలేరా: నీలం సాహ్నిపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

నీలం సాహ్ని తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన తర్వాత ఆమెను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఆమె ఆ పదవిలో కొనసాగుతున్న సమయంలోనే ఏపీ ఎస్ఈసీగా పదవీ విరమణ చేశారు. దాంతో ఆయన స్థానంలో ప్రభుత్వం ఆమెను ఏపీ ఎస్ఈసీగా నియమించింది.

ఆమె ఏపీఎస్ఈసీగా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే జడ్పీటీసీ, ఎంపీటీసి ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు ఈ ఎన్నికల పోలింగ్ జరిగినప్పటికీ కోర్టు ఆదేశాలతో ఓట్ల లెక్కింపును నిలిపేశారు. తాజాగా ఆ ఆ నోటిఫికేషన్ చెల్లదని, పరిషత్ ఎన్నికలను రద్దు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

click me!