ఎస్ఈసీగా నీలం సాహ్ని: విచారణ జూన్ 29కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

Siva Kodati |  
Published : Jun 21, 2021, 12:52 PM IST
ఎస్ఈసీగా నీలం సాహ్ని: విచారణ జూన్ 29కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌గా నీలం సాహ్ని నియామకంపై ఏపీ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అదనపు వివరాలు ఇవ్వడానికి సమయం కోరాడు పిటిషనర్. దీనిపై తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది హైకోర్టు.   

గత బుధవారం కూడా సమగ్ర సమాచారం లేకుండా  'పిల్' వేసిన పిటిషనర్ పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ రాష్ట్ర ఎస్ఈసీ నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ముగ్గురి పేర్లు రాజ్యాంగ విరుద్దమని పిటిషనర్ కోరారు. నీలం సహానీని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా  నియమిస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. పూర్తి సమాచారం లేకుండా ఎలా పిల్ వేస్తారని హైకోర్టు పిటిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణ సోమవారానికి వాయిదా వేసింది. 

Also Read:ఎస్ఈసీగా నియామకం...నీలం సాహ్నికి, జగన్ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

ఏపీ ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ పదవీ విరమణ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురి పేర్లను గవర్నర్ కు సిఫారసు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సలహదారుగా ఉన్న నీలం సహానీ పేరును ఎస్ఈసీగా గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో ఏపీ ఎస్ఈగా నీలం సహనీ కొనసాగుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?