ఏపీలో ఇళ్ల నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్: సింగిల్ జడ్జి ఉత్తర్వులను తోసిపుచ్చిన డివిజన్ బెంచ్

By narsimha lodeFirst Published Nov 30, 2021, 11:40 AM IST
Highlights


ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి ఆటంకాలు లేకుండా పోయాయి. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ తోసి పుచ్చింది. 
 

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి  మార్గం సుగమమైంది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. దీంతో ఇళ్ల నిర్మాణానికి ఆటంకాలు తొలగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేయవద్దని  సింగిల్ బెంచ్ ఆదేశించింది. అయితే ఈ తీర్పును ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది.  రాష్ట్రంలో  పేదలకు  ఇళ్ల పట్టాలిచ్చి వారికి ఇళ్లు నిర్మించే కార్యక్రమానికి Ys jagan ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే పేదలకు సెంటున్నర స్థలంలో House contruction చేయాలని ప్రభుత్వం తలపెట్టింది.  అయితే ఈ విషయమై  ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని నిరసిస్తూ సుమారు 128 పిటిషన్లుAP High court లో దాఖలయ్యాయి.  వైఎస్సార్ హౌసింగ్ స్కీంలో భాగంగా కాలనీల్లో లబ్దిదారులకు మునిసిపల్‌ ప్రాంతాలైతే ఒక సెంటు, గ్రామ పంచాయతీల పరిధిలోనైతే ఒకటిన్నర సెంటు స్థలాన్ని ఇంటి నిర్మాణం నిమిత్తం ప్రభుత్వం కేటాయించింది.

అయితే ఇది ఎంత మాత్రం సరిపోదని హైకోర్టు పేర్కొంది. ‘‘దీనివల్ల ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చు. అగ్నిప్రమాదాల నుంచి రక్షణ ఉండదు. తాగునీటి సమస్యలుంటాయి. మౌలిక సదుపాయాలు ఉండవు. మురుగు నీరు కూడా బయటకు వెళ్లదు. ఇళ్ల స్థలాలు కేటాయించే ముందు ప్రభుత్వం ఈ ఇబ్బందుల గురించి అధ్యయనం చేసి ఉండాలని హైకోర్టు సింగిల్ బెంచ్ అభిప్రాయపడింది.ఈ పిటిషన్లపై విచారణ నిర్వహించిన సింగిల్ బెంచ్ ఈ ఏడాది అక్టోబర్ 9న ఇళ్ల నిర్మాణాలను నిలిపివేయాలని  ఆదేశించింది.కన్వేయన్స్ డీడ్ ను రద్దు చేసి డీ ఫారం పట్టా కూడా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది

also read:ఇల్లు లేని పేదలు రాష్ట్రంలో ఉండొద్దనేది లక్ష్యం: జగన్

2019 డిసెంబర్ 2న ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 367, 488 మార్గదర్శకాలకు సంబంధించిన జీవోను సవాల్ చేస్తూ పొదిలి శివ ముళి, మరో 128 మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.  అయితే  ఈ తీర్పును ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. ఇరు వర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులను తోసి పుచ్చింది. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి హైకోర్టుల్లో దాఖలైన  పిటిషన్ల వెనుక టీడీపీ ఉందని వైషీపీ ఆరోపించింది.  ఈ విషయమై  ఏపీ సీఎం వైఎస్ జగన్ సహా పలువురు వైసీపీ నేతలు టీడీపీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. అయితే  ఈ విమర్శలను టీడీపీ  తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కేసులు తాము వేయించలేదని చంద్రబాబు ప్రకటించారు. ‘పేదలందరికీ ఇళ్లు'  ఇవ్వాలనే లక్ష్యంగా జగన్ సర్కార్ ఈ పథకానికి రూప కల్పన చేసింది.. ప్రత్యేక కమిటీ నివేదిక ఆధారంగా అవసరమైతే అదనంగా భూమి కొనుగోలు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని భావించింది. వచ్చే ఎన్నికల్లోగా నిర్దేశిత లక్ష్యం మేరకు పూర్తి చేసేందుకు వీలుగా నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. ఇళ్ల నిర్మాణం పథకానికి హైకోర్టు బ్రేక్ వేయడంపై అధికార, విపక్షాల మధ్య విమర్శలు చోటు చేసుకొన్నాయి

 

click me!