ఎంతో ఆశతో వచ్చాం.. కానీ.. సీఎం జగన్​కు ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి లేఖ..

By SumaBala BukkaFirst Published Jan 21, 2022, 10:37 AM IST
Highlights

23.29 శాతం ఫిట్మెంట్ మధ్యంతర భృతి కన్నా .. తక్కువగా ఉందన్నారు. ఈ విధంగా ఫిట్మెంట్‌ ను తగ్గించిన దాఖలాలు దేశంలోని ఏ రాష్ట్రంలో లేదన్నారు. దీంతో ఉద్యోగులందరూ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత జీవితాలు ఎంతో ఉన్నతంగా ఉంటాయని ఆశతో ఇక్కడికి వచ్చామన్నారు.

CM Jaganకు AP High Court ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు లేఖ రాశారు. 23.29 శాతం ఫిట్మెంట్ మధ్యంతర భృతి కన్నా తక్కువగా ఉందన్నారు. ఈ విధంగా Fitment‌ను తగ్గించిన దాఖలాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన Wage revision జీవో ఎంతగానో నిరాశపరిచిందని AP High Court Employees Union అధ్యక్షుడు వేణుగోపాలరావు అన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి లేఖ రాశారు. 

23.29 శాతం ఫిట్మెంట్ మధ్యంతర భృతి కన్నా .. తక్కువగా ఉందన్నారు. ఈ విధంగా ఫిట్మెంట్‌ ను తగ్గించిన దాఖలాలు దేశంలోని ఏ రాష్ట్రంలో లేదన్నారు. దీంతో ఉద్యోగులందరూ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత జీవితాలు ఎంతో ఉన్నతంగా ఉంటాయని ఆశతో ఇక్కడికి వచ్చామన్నారు. గత ప్రభుత్వం ఇంటి అద్దె అలవెన్స్ 30 శాతం, ఉచిత వసతి, ఐదు రోజుల పనిదినం, రవాణా సౌకర్యాలు కల్పించిందన్నారు. అంతేకాక సీఆర్డీఏ పరిధిలో నామమాత్రపు ధరతో ఫ్లాట్లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసిందన్నారు. ప్రస్తుత అద్దె అలవెన్స్ స్లాబ్ ప్రకారం ఏపీలో ఏ నగరంలోనూ ఇల్లు అద్దెకు తీసుకునే పరిస్థితి లేదన్నారు.

కాగా, ముఖ్యమంత్రి ys jagan mohan reddyతో జరిగిన భేటీలో ఉద్యోగులు పీఆర్సీకి అంగీకరించారని.. మళ్లీ ఇప్పుడు ఆందోళన చేయడం సరికాదన్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి adimulapu suresh.  గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇబ్బందులుంటే ప్రభుత్వంతో మాట్లాడవచ్చని సూచించారు. రాష్ట్రంలో స్కూళ్లకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని మంత్రి స్పష్టం చేశారు. కొన్ని యూనివర్శిటీలు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయన్నారు. కోర్టు కూడా పరీక్షలకు అనుమతి ఇచ్చిందన్నారు.

ఇదిలా ఉండగా, పీఆర్సీపై రేపటి నుంచి ఒకటే డిమాండ్, ఒకటే ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతామని ఏపీ ఉద్యోగ సంఘాలు తెలిపాయి. గురువారం ఉద్యోగ సంఘాల నేతలు అమరావతిలో సమావేశమయ్యాయి. ఈ భేటీ అనంతరం సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. తామంతా ఇప్పటి వరకు సంఘాలుగా విడివిడిగా పోరాడమన్నారు. కానీ ఇక నుంచి ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ కోసం ఉమ్మడిగా పోరాడతామని వెంకట్రామిరెడ్డి తెలిపారు. 

శుక్రవారం మరోసారి అందరితో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. బొప్పరాజు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో 13 లక్షల మంది ఉద్యోగుల శ్రేయస్సు కోసం నాలుగు సంఘాలు ఏక తాటిపైకి వచ్చాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలతో ఉద్యోగులకు నష్టమని బొప్పరాజు అన్నారు. దీనిపై రేపు సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో నాలుగు సంఘాలు కలిసి ఐక్య కార్యచరణపై చర్చిస్తామని వెంకటేశ్వర్లు తెలిపారు. 

కాగా.. సీఎం జగన్‌తో ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 7వ తేదీన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 23.29 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం Ys Jagan హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లోని ఐదు D.A లను ఒకే సారి ఇస్తామని హమీ ఇచ్చారు. ఫిట్‌మెంట్ కనీసం 27 శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే పెండింగ్ డిఏలు ఒకేసారి ఇస్తామని హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.

click me!