జగన్ సర్కార్‌కు హైకోర్ట్ షాక్: రామతీర్థ ఆలయానికి ధర్మకర్తగా అశోక్ గజపతి

By Siva KodatiFirst Published Jan 28, 2021, 7:56 PM IST
Highlights

హైకోర్టులో జగన్ సర్కార్ కు మరో షాక్ తగిలింది. రామతీర్థం శ్రీరామాలయానికి అనువంశిక ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజును తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు కొట్టేసింది. దీంతో అశోక్ గజపతిరాజుకు హైకోర్టులో ఊరట లభించినట్ల

హైకోర్టులో జగన్ సర్కార్ కు మరో షాక్ తగిలింది. రామతీర్థం శ్రీరామాలయానికి అనువంశిక ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజును తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు కొట్టేసింది. దీంతో అశోక్ గజపతిరాజుకు హైకోర్టులో ఊరట లభించినట్లయింది.

కాగా, రాష్ట్రంలోని మూడు ప్రముఖ దేవస్థానాల ధర్మకర్త హోదా నుండి అశోక్ గజపతిరాజును ప్రభుత్వం తొలగించిన విషయం విదితమే. రామతీర్థం రామాలయం, విజయనగరం పైడితల్లి, మందపల్లి ఆలయ ధర్మకర్త హోదా నుంచి అశోక్ గజపతిరాజు తొలగించిన ప్రభుత్వం, ఆయన హోదాను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో ఇచ్చిన జీవో 65 ను ఉపసంహరిస్తూ దేవాదాయ శాఖ మెమో ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై అశోక్‌గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. 

Also Read:అశోక్ గజపతికి షాక్: రామతీర్థం సహా 3 ఆలయాల ఛైర్మన్ పదవి నుంచి ఉద్వాసన

కోర్టు తాజా తీర్పు తర్వాత అశోక్ గజపతి రాజు ట్వీట్ చేశారు. న్యాయస్థానం తీర్పు ద్వారా ప్రభుత్వ కక్ష సాధింపు ఆటలు భగవంతుడి ముందు సాగవని.. ఆ రాముడే తనను ఆశీర్వదించారని స్పష్టం చేశారు.

ఆయన దీవెనలతోనే తాను రామ తీర్థ ఆలయ ధర్మకర్తగా సేవలందిస్తానంటూ పేర్కొన్నారు. మరోసారి రాముడికి సేవ చేసే భాగ్యం కలిగిందని అశోక్ హర్షం వ్యక్తం చేశారు .

ఈ రోజు రామతీర్ధం వద్ద స్వామి వారి విగ్రహాల పునః ప్రతిష్ఠ అని తెలిసిందని , ఈ పవిత్రమైన రోజున రాముడు తన సేవలో కొనసాగడానికి నన్ను ఆశీర్వదించాడని గజపతి రాజు ట్వీట్ చేశారు. 

click me!