ఏపీ జడ్జిలకు ఘన స్వాగతం: రేపటి నుండే హైకోర్టు విధులు షురూ

By narsimha lodeFirst Published Dec 31, 2018, 6:12 PM IST
Highlights

ఏపీ రాష్ట్ర తాత్కాలిక హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌కు సోమవారం సాయంత్రం ఘనంగా స్వాగతం పలికారు.

అమరావతి: ఏపీ రాష్ట్ర తాత్కాలిక హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌కు సోమవారం సాయంత్రం ఘనంగా స్వాగతం పలికారు.

ఏపీ హైకోర్టు తాత్కాలిక జడ్జిగా  ప్రవీణ్‌కుమార్‌ నియమితులయ్యారు. హైకోర్టు ప్రవీణ్ కుమార్‌ తో పాటు ఏపీ జడ్జిలకు జిల్లా జడ్జి, జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్‌లు ఘనంగా స్వాగతం పలికారు.

పోలీసుల గౌరవ వందనాన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ స్వీకరించారు.  అనంతరం జడ్జిలంతా దుర్గ గుడిని సందర్శించనున్నారు.మంగళవారం నాడు ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్  నరసింహాన్  రాష్ట్ర చీఫ్ జస్టిస్‌తో పాటు ఇతర జడ్జిలతో ప్రమాణం చేయించనున్నారు.

ఏపీకి అలాట్ చేసిన జడ్జిలంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఏపీకి వచ్చారు. నోవాటెల్  హోటల్‌లో  జడ్జి కుటుంబసభ్యులకు బస ఏర్పాటు చేశారు.సీఎం క్యాంప్ కార్యాలయంలో  హైకోర్టు తాత్కాలిక భవనం కొనసాగనుంది.

జనవరి ఐదో తేదీ వరకు హైకోర్టు కొనసాగుతోంది. ఆ తర్వాత సంక్రాంతి సెలవులను ఇస్తారు.  సెలవుల తర్వాత హైకోర్టు తిరిగి పనిచేయనుంది. అయితే సెలవులు పూర్తయ్యే వరకు సిటీ సివిల్ భవన నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. సిటీ సివిల్ కోర్టు భవనంలోనే హైకోర్టును నిర్వహించనున్నారు.


 

click me!