వైఎస్ వివేకా కేసు: సీబీఐకి అప్పగింతకు అభ్యంతరాలున్నాయా హైకోర్టు ప్రశ్న

By narsimha lodeFirst Published Feb 13, 2020, 2:27 PM IST
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై హైకోర్టు గురువారం నాడు విచారణ చేసింది. సీబీఐకి విచారణకి అప్పగిస్తే ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని హైకోర్టు ప్రశ్నించింది. 

అమరావతి: మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై  గురువారం నాడు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. టీడీపీ ఎమ్మెల్సీ బీలెక్ రవి తరపున ప్రముఖ న్యాయవాది  సల్మాన్ ఖుర్షీద్ వాదించారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును సీబీఐకి అప్పగించాలని  కోరుతూ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతా,,  వివేకానందరెడ్డి భార్య హైకోర్టును ఆశ్రయించారు.

ఈ నాలుగు పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది.  సిట్ విచారణ సక్రమంగా జరగడం లేదని పిటిషనర్ తరపున న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అనుమానాస్పద మృతిగానే కేసును నమోదు చేసిన విషయాన్ని  ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ కేసులో ఇప్పటికి ముగ్గురిని అరెస్ట్ చేశారని చెప్పారు. మరో వైపు వివేకానందరెడ్డి డ్రైవర్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు.

Also read:నా తండ్రిని చంపిన వారి నుండి ప్రాణ ముప్పు: డీజీపీకి వివేకా కూతురు లేఖ

వివేకానందరెడ్డి హత్య కేసులో  పోలీసులు ఇంతవరకు ఎలాంటి సమాచారాన్ని బయటకు తీయలేకపోయారని ఆయన  కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించడానికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని   హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ పిటిషన్‌పై భోజన విరామం తర్వాత కూడ వాదనలు కొనసాగుతాయి.  

click me!