Andhra Pradesh: కాలేజీ విద్యార్థుల అటెండెన్స్ పై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..

Published : Jun 05, 2025, 08:02 AM IST
ap high court

సారాంశం

అనారోగ్యం వల్ల క్లాసులకు హాజరుకాలేకపోయిన విద్యార్థికి పరీక్షల అనుమతి ఇవ్వాలని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (High Court)విద్యార్థుల హాజరు విషయంలో ముఖ్యమైన తీర్పు చెప్పింది. అనారోగ్యం వల్ల తరగతులకు హాజరుకాలేకపోయిన విద్యార్థులకు పరీక్ష రాసే హక్కు ఉంటుందని తేల్చి చెప్పింది. అసలు ఏపీ హైకోర్టు ఇలాంటి తీర్పుని వెలువరించడానికి ఓ ముఖ్య కారణం ఉంది. అది ఏంటేంటే..విజయనగరం జిల్లా రాజాంలోని జీఎంఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చదువుతున్న బీవీకే కౌశిక్ అనే విద్యార్థి గతేడాది అనారోగ్యం పాలయ్యాడు. 

హాజరు శాతం తక్కువగా ఉందని…

ఆరోగ్య సమస్యలతో కొన్ని రోజులు క్లాసులకు హాజరుకాలేకపోయాడు. హాజరు శాతం తక్కువగా ఉందని కాలేజీ యజమాన్యం మూడో సెమిస్టర్ పరీక్షకు అనుమతించలేదు.ఈ పరిస్థితిలో విద్యార్థి ఏపీ హైకోర్టును ఆశ్రయించాడు. కనీసం తనని నాలుగో సెమిస్టర్ (Semister Exams) క్లాసులకు హాజరయ్యే అవకాశం ఇవ్వాలని కోర్టును కోరాడు.ఈ అంశం పై విచారణ చేపట్టిన హైకోర్టు, విద్యార్థి తరఫున తీర్పు వెలువరించింది. కౌశిక్ అనారోగ్యం కారణంగా తరగతులకు హాజరు కాలేదని, ఇది విద్యార్థి చేతుల్లో లేని పరిస్థితేనని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

ఈ నిబంధన సరికాదు..

కేవలం హాజరు శాతాన్ని ఆధారంగా చేసుకుని పరీక్షల అర్హతను నిరాకరించడం సరైన విధానం కాదని కోర్టు స్పష్టం చేసింది. అలాగే, ప్రభుత్వ నిబంధన కాకుండా ప్రైవేట్ కాలేజీ విధించిన ఈ హాజరు నిబంధన సహేతుకం కాదని పేర్కొంది.కావున, కౌశిక్‌కు పరీక్షలు రాసే అనుమతి ఇవ్వాలన్న ఆదేశాలతో పాటు, తదుపరి తరగతులకు హాజరయ్యేందుకు కూడా అనుమతి ఇవ్వాలని కాలేజీ ప్రిన్సిపల్‌ను ఆదేశించింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?