జగన్‌కు ఊరట.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు, హైకోర్టు కీలక ఆదేశాలు

By Siva KodatiFirst Published Aug 26, 2022, 4:08 PM IST
Highlights

అక్రమాస్తుల కేసులో విచారణల సందర్భంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. 

ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు విచారణల సందర్భంగా వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇచ్చింది. రోజువారీ విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి జగన్‌కు మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు గతంలో సీబీఐ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది హైకోర్ట్. సీఎం జగన్ అభ్యర్ధనకు ఉన్నత న్యాయస్థానం అంగీకారం తెలిపింది. అయితే సీబీఐ కోర్ట్ తప్పనిసరని భావించినప్పుడు హాజరుకావాలని జగన్‌ను హైకోర్ట్ ఆదేశించింది. 

ALso Read:వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు: హైకోర్టు తలుపు తట్టిన వైఎస్ జగన్

అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందేనని హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రతి శుక్రవారం విచారణకు మొదటి ముద్దాయి, రెండో ముద్దాయి హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. అయితే సీఎం హోదాలో పరిపాలన కార్యక్రమాలో బిజీగా వుండటం, మరిన్ని కారణాల నేపథ్యంలో వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఇటీవల వైఎస్ జగన్ సీబీఐ కోర్టుకు హాజరు కావడం లేదు. ఎప్పటికప్పుడు వ్యక్తిగత మినహాయింపు కోరుతూ ఆయన దాటేస్తూ వస్తున్నారు. దీంతో కోర్టు కూడా అసహనం వ్యక్తం చేస్తోంది. 

click me!