విద్యార్ధులకు సాఫ్ట్‌స్కిల్స్‌తో ఉపాధి అవకాశాలు: విశాఖలో ఏపీ సీఎం వైఎస్ జగన్

By narsimha lodeFirst Published Aug 26, 2022, 1:30 PM IST
Highlights

రాష్ట్రానికి చెందిన విద్యార్ధులు ప్రపంచంతో పోటీ పడేలా శిక్షణ ఇస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ పొందిన విద్యార్ధులకు సర్టిఫికెట్లు అందించారు జగన్.

విశాఖపట్టణం: ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రంలో విద్యార్ధులను అన్ని రంగాల్లో రాటుదేలేలా శిక్షణ ఇస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. 

40 వేల మంది విద్యార్ధులకు మైక్రోసాఫ్ట్ 40  విభాగాల్లో శిక్షణ ఇచ్చింది. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్ధులకు ఏపీ సీఎం వైఎస్ జ.గన్ శుక్రవారం నాడు విశాఖపట్టణంలో సర్టిఫికెట్లు అందించారు.  ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగించారు.  రాష్ట్రంలోని  1.62 లక్షల మంది విద్యార్ధులకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇస్తున్నామన్నారు.ఈ శిక్షణ తర్వాత విద్యార్ధులకు ఉపాధి అవకాశాలు చాలా సులభం కానున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. 

విద్యార్ధులకు మైక్రోసాఫ్ట్ ద్వారా దేశంలోనే నైపుణ్య శిక్షణ అందిస్తున్న విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు.తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో ఎన్నోవిప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చినట్టుగా సీఎం గుర్తు చేశారు. విద్యాదీవెన, విద్యా వసతి  దీవెన, విద్యాకానుక ద్వారా విద్యార్దులకు అండగా ఉంటున్నట్టుగా జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశ పెట్టామన్నారు సీఎం.చదువు ఉంటేనే పిల్లలు ప్రయోజకులు అవుతారని సీఎం చెప్పారు.

 


 

click me!