ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణ సీబీఐకి: ఉండవల్లి పిటిషన్ పై విచారణ నాలుగు వారాలకు వాయిదా

By narsimha lode  |  First Published Oct 13, 2023, 12:13 PM IST

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని  మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.


అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణను సీబీఐకి ఇవ్వాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన  పిటిషన్  పై విచారణను నాలుగు వారాలకు  వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఈ కేసులో 44 మంది ప్రతివాదులకు  నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.చంద్రబాబు, అచ్చెన్నాయుడు సహా  44 మందికి నోటీసులు జారీ చేయనున్నారు. ఈ కేసు విచారణను సీబీఐతో విచారణ చేయడానికి తమకు అభ్యంతరం లేదని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్  ఏపీ హైకోర్టుకు తెలిపారు. 

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసును సీఐడీతో కాకుండా సీబీఐతో విచారణ చేయించాలని  ఏపీ హైకోర్టులో ఉండవల్లి అరుణ్ కుమార్  ఈ ఏడాది సెప్టెంబర్ 22న  పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈ ఏడాది సెప్టెంబర్ 27న ఏపీ హైకోర్టులో విచారణ వచ్చింది.  జస్టిస్ రఘునందన్ రావు బెంచ్ ముందుకు ఈ పిటిషన్ వచ్చింది. అయితే ఈ పిటిషన్ ను వేరే బెంచ్ కు బదిలీ చేయాలని  జస్టిస్ రఘునందన్ రావు  హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. దీంతో  ఈ పిటిషన్ పై విచారణను మరో  బెంచీకి బదిలీ అయింది.  దీంతో మరో బెంచ్ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ పై విచారణ నిర్వహించింది. ప్రతి వాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.

Latest Videos

undefined

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  అంతరాష్ట్ర సమస్యలున్నాయని ఉండవల్లి అరుణ్ కుమార్ చెబుతున్నారు. ఇది తీవ్రమైన ఆర్ధిక నేరంగా అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.  సీఐడీతో కాకుండా సీబీఐతో విచారణ చేయించాలని ఆ పిటిషన్ లో ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టును కోరారు. 

also read:ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు సీబీఐ విచారణకుఉండవల్లి పిటిషన్: వేరే బెంచ్ కు బదిలీ చేయాలని జడ్జి ఆదేశం

ఇదిలా ఉంటే  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసును సీబీఐతో విచారణ చేయించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై టీడీపీ నేతలు ఆయనపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబును  ఏపీ సీఐడీ అధికారులు ఈ ఏడాది సెప్టెంబర్ 9న అరెస్ట్ చేశారు.ఈ కేసులో అరెస్టైన చంద్రబాబు  రాజమండ్రి జైలులో ఉన్నారు.  ఈ కేసులో  ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టులో  ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసిన విషయం తెలిసిందే.


 

click me!