జనసేనకు ఆ పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి రాజీనామా చేశారు.
నెల్లూరు : జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు. గురువారం ఒక ప్రకటనలో కేతంరెడ్డి ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. నగరంలో జనసేన కోసం ఎంతో కృషి చేశానన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గానికి అభ్యర్థిగా నారాయణను టీడీపీ మూడునెలల క్రితం ప్రకటించిందని చెప్పుకొచ్చారు.
అయితే, అప్పటికి జనసేనతో టీడీపీకి పొత్తు లేదు. అప్పుడే.. తనకు వచ్చే ఎన్నికల్లో సీటు ఆశించొద్దని పార్టీ పెద్దలు పలువురు తెలిపారని, నారాయణతో మనం కలిసి పనిచేయాలని చెప్పారన్నారు. నారాయణ అక్రమాలపైనే 2016లో సేవ్ నెల్లూరు అంటూ పోరాటం చేశామని, 2019 ఎన్నికల్లోకూడా ప్రత్యర్థిగా ఆయన అక్రమాల మీద గళం వినిపించానని తెలిపారు.
పార్టీలో తనకంటూ గౌరవం లేకుండా, తాను భరోసా కల్పించిన ప్రజలకు నమ్మకం పోగొట్టేలా పార్టీలోని పలువురు వ్యవహరించారని, ఇది సహించలేకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని కేతంరెడ్డి వినోద్ రెడ్డి పేర్కొన్నారు.
ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.