andhra pradesh fiber grid case:ఏడుగురు నిందితుల ఆస్తుల జప్తునకు ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్

By narsimha lode  |  First Published Nov 21, 2023, 4:44 PM IST


ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కేసులో  ఏసీబీ కోర్టు  మంగళవారంనాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏడుగురు నిందితులకు చెందిన  రూ. 114 కోట్ల ఆస్తులను జప్తునకు  ఏసీబీ కోర్టు ఆదేశించింది.


అమరావతి:ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కేసులో  రూ. 114 కోట్ల ఆస్తులను  జప్తు చేసేందుకు  ఏసీబీ కోర్టు  మంగళవారంనాడు  ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఉన్న ఏడుగురు నిందితులకు చెందిన  రూ. 114 కోట్ల ఆస్తులను జప్తు చేయాలని  ఏసీబీ కోర్టు ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ (ఫైబర్ గ్రిడ్ ) కేసులో  ఏడుగురు నిందితుల కేసులో   ఆస్తుల జప్తు చేయాలని హోంమంత్రిత్వ శాఖ  ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు ఈ ఏడాది నవంబర్ 2వ తేదీన జప్తు చేసిన విషయం తెలిసిందే. ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు నాయుడు ఏ 25గా ఉన్నారు. 
చంద్రబాబునాయుడుకు సన్నిహితులుగా ఉన్న ఏడుగురు నిందితుల ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతివ్వాలని  ఏసీబీ కోర్టులో  ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.

Latest Videos

undefined

also read:AP Skill development case లో చంద్రబాబు బెయిల్‌‌పై సుప్రీంలో ఏపీ సీఐడీ పిటిషన్

ఈ కేసులో ఏ1 గా ఉన్న వేమూరి హరికృష్ణ ప్రసాద్,  ఏ 11 గా టెరా సాఫ్ట్ వేర్ లిమిటెడ్ సంస్థ  డైరెక్టర్ తుమ్మల గోపిచంద్ కుట్రకు పాల్పడ్డారని  సీఐడీ ఆరోపించింది.తుమ్మల గోపిచంద్ , ఆయన భార్య  పావని పేర్లపై హైద్రాబాద్ శ్రీనగర్ కాలనీ, యూసుఫ్ గూడ, జూబ్లీహిల్స్ కాలనీ, చిన్న మంగళారంలో ఇల్లు, వ్యవసాయక్షేత్రాలు అటాచ్ కోరుతూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.

మరో వైపు ఇదే కేసులో ఉన్న నెటాప్స్ ఫైబర్ సొలూష్యన్స్ డైరెక్టర్ కనుమూరి కోటేశ్వరరావు కు చెందిన గుంటూరు, విశాఖ ఇళ్లు, గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్టణంలోని ప్లాట్  , హైద్రాబాద్ లోని నాలుగు ప్లాట్లు, రంగారెడ్డి జిల్లాలోని వ్యవసాయభూమి అటాచ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై  ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ  జరిగింది.ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలను ఏసీబీ కోర్టు విన్నది.  ఏడుగురు నిందితుల ఆస్తుల అటాచ్ మెంట్ కు  ఏసీబీ కోర్టు అనుమతిని ఇచ్చింది.

ఏపీ ఫైబర్ గ్రిడ్  ప్రాజెక్టును దక్కించుకొనేందుకు విప్లవ్‌కుమార్‌, విజయ్‌కుమార్‌ రామ్మూర్తి, కనుమూరి వెంకటేశ్వరరావు వంటి వారికి చెందిన సంస్థలు కుట్రలో పాల్గొన్నాయని  సీఐడీ ఆరోపిస్తుంది. నాసిరకం పరికరాలతో ప్రభుత్వాన్ని మోసం చేశారని టెరాసాఫ్ట్‌కు నిధుల విడుదల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.114కోట్ల నష్టం వాటిల్లినట్టు  సీఐడీ పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ , ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసు, అంగళ్లు ఘర్షణ కేసు,  మద్యం తయారీ కంపెనీలకు అక్రమంగా అనుమతులు,  ఇసుక విధానంలో అక్రమాలపై  కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లలో అక్రమాలపై  చంద్రబాబు నాయుడిపై  ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆయా కేసులకు సంబంధించి చంద్రబాబునాయుడు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై కోర్టుల్లో విచారణ సాగుతుంది.


 

click me!