పంచాయితీ నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు శుక్రవారారినికి వాయిదా వేసింది.
అమరావతి: పంచాయితీ నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు శుక్రవారారినికి వాయిదా వేసింది.పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ ను హైకోర్టు గురువారం నాడు విచారించింది. ఈ సమయంలో జోక్యానికి అవకాశం ఉందా అని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది.
also read:2019 ఓటరు జాబితా ప్రకారం ఎన్నికలు: విచారణను రేపటికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
ఎన్నికల షెడ్యూల్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. అయితే డివిజన్ బెంచ్ కు డివిజన్ బెంచ్ కు వెళ్తానని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. అంతేకాదు తన పిటిషన్ ను డిస్మిస్ చేయాలని కోరారు. దీంతో ఈ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.
పంచాయితీ ఎన్నికల ఎన్నికలకు 2019 ఓటరు జాబితాను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ గుంటూరుకు చెందిన అఖిల తరపున న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నిన్నిటి విచారణకు కొనసాగింపుగా ఇవాళ కూడ హైకోర్టు విచారణ సాగించింది.