అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో నారాయణ పిటిషన్: మరో బెంచ్ కు బదిలీ చేయాలని జడ్జి ఆదేశం,విచారణ ఎల్లుండికి వాయిదా

By narsimha lode  |  First Published Oct 4, 2023, 11:57 AM IST


అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది.ఈ పిటిషన్ ను మరో బెంచ్ కు బదిలీ చేయాలని న్యాయమూర్తి కోరారు.



అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో  తనను ఇంటి వద్దే విచారించాలని మాజీ మంత్రి  నారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ నుండి జడ్జి తప్పుకున్నారు. ఈ పిటిషన్ ను మరో బెంచ్ కు బదిలీ చేయాలని న్యాయమూర్తి  హైకోర్టు రిజిస్ట్రీని కోరారు.

కోరారు. దీంతో ఈ పిటిషన్ పై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది.  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో  విచారణకు రావాలని ఏపీ సీఐడీ అధికారులు  నారాయణకు  నోటీసులు జారీ చేశారు.  ఇదే విషయమై  నారా లోకేష్ కు కూడ సీఐడీ నోటీసులు జారీ చేసింది. అయితే  ఈ నోటీసుల్లో పేర్కొన్న నిబంధనలపై  ఈ నెల 3న  లోకేష్ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన  ఏపీ హైకోర్టు  ఈ నెల  10న లోకేష్ విచారణను వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Latest Videos

undefined

తన వయస్సు, ఆరోగ్య కారణాల రీత్యా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తనను ఇంటి వద్దే విచారించేలా అనుమతివ్వాలని ఏపీ హైకోర్టులో ఈ నెల 3న  మాజీ మంత్రి నారాయణ  పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ ను ఏపీ హైకోర్టులో శ్రీనివాస్ రెడ్డి బెంచ్ ముందుకు వచ్చింది.ఈ పిటిషన్ పై విచారణ నుండి జడ్జి శ్రీనివాస్ రెడ్డి తప్పుకున్నారు. మరో బెంచ్ కు ఈ పిటిషన్ ను బదిలీ చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని  జడ్జి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.ఈ పిటిషన్ పై రెండు రోజులకు హైకోర్టు వాయిదా వేసింది.  ఎల్లుండి ఈ పిటిషన్ పై విచారణ  సాగనుంది. 

also read:అమరావతి అసైన్డ్ భూముల కేసు: మాజీ మంత్రి నారాయణ ముందస్తు బెయిల్ మరో రెండు వారాల పొడిగింపు

అమరావతి అసైన్డ్ భూముల కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులకు సంబంధించి ఏపీ హైకోర్టులో నిన్న విచారణ సాగింది.ఈ కేసులో  నారాయణకు మరో రెండు వారాల పాటు  ముందస్తు బెయిల్ ను హైకోర్టు పొడిగించింది. 


 

click me!