ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 17వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.
అమరావతి:ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఈ పిటిషన్ పై సీఐడీ తరపు న్యాయవాదులు సమయం కోరడంతో ఏపీ హైకోర్టు విచారణను వాయిదా వేసింది.ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
undefined
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ చేశారు.ఈ కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం జ్యుడీషీయల్ రిమాండ్ లో ఉన్నారు.ఈ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు ఈ ఏడాది సెప్టెంబర్ 14న బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై ఏసీబీ కోర్టు ఇరు వర్గాల వాదనలు విన్నది. ఈ నెల 9వ తేదీన చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.
దీంతో ఏపీ హైకోర్టులో చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసిన విషయాన్ని సీఐడీ తరపు న్యాయవాదులు హైకోర్టులో ప్రస్తావించారు. అయితే ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఏపీ హైకోర్టు ఆదేశించింది..
also read:ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు: చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ముందస్తు బెయిల్, బెయిల్ పొందిన విషయాన్ని చంద్రబాబు తరపు న్యాయవాదులు గుర్తు చేశారు. చంద్రబాబు జ్యుడీషీయల్ రిమాండ్ 32 రోజులు దాటిన విషయాన్ని కూడ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.ఈ విషయమై తమకు సమయం కావాలని సీఐడీ తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టును కోరారు. దీంతో కౌంటర్ ను ఈ నెల 17వ తేదీ లోపుగా దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 17న ఈ పిటిషన్ పై విచారణ నిర్వహిస్తామని ఏపీ హైకోర్టు తెలిపింది.