
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో గురువారం వాదనలు జరిగాయి. ఫిబ్రవరి 2వ తేదీకి విచారణ వాయిదా వేసింది కోర్ట్. ఆ రోజునే తుది విచారణ జరగనుంది. స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా పిటిషన్ వేశారు రిటైర్డ్ ఐపీఎస్ లక్ష్మీనారాయణ (cbi jd lakshmi narayana) . ఫిబ్రవరి 2లోపు కేంద్రం నిర్ణయాలు తీసుకుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోర్టు చెప్పిందని లక్ష్మీనారాయణ వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ నుంచి ఎటువంటి అఫిడవిట్ దాఖలు కాలేదని ఆయన తెలిపారు. కేంద్రం అఫిడవిట్‌నే తమ అఫిడవిట్‌గా తీసుకోవాలని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చెప్పిందని లక్ష్మీనారాయణ చెప్పారు. నాడు భూములు ఇచ్చిన 8 వేల మంది రైతులకు న్యాయం జరగలేదన్నారు.
కాగా.. రుణ భారం అధికం కావడంతో పాటు అప్పుల్లోకి జారుకుంటున్నాయనే కారణాలు చూపుతూ కేంద్ర ప్రభుత్వం పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరిస్తోంది. వాటిల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఉంది. అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తూ Vizag steel plant కోసం కార్మికులు, రాష్ట్ర ప్రజలు పోరాటం సాగిస్తున్నారు. గత బుధవారం నాటికి స్టీల్ ప్లాంట్ కార్మిక పోరాటం 300 రోజులకు చేరింది. ఈ నేపథ్యంలోనే కార్మికులు స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిరసిస్తూ సాగుతున్న ఉద్యమాన్ని మరింత ఉధృత చేసే దిశగా ప్రణాళికలు చేస్తున్నారు. కేంద్రం Vizag steel plant ప్రయివేటీకరణ నిర్ణయం తీసుకున్న జనవరి 27 నుండి కార్మికులు, రాష్ట్ర ప్రజలు ఉద్యమం చేస్తున్నారు. ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ALso Read:విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ .. చేతగాని వ్యక్తులు చట్టసభల్లో ఎందుకు : వైసీపీపై పవన్ వ్యాఖ్యలు
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ సైతం Vizag steel plant ప్రయివేటీకరణ ఉద్యమానికి మద్దతు ప్రకటించింది. జనసేన సైతం ఈ ఉద్యమానికి సై అంది. టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మిక పోరాటానికి మద్దతు ప్రకటించడంతో పాటు వారి వద్దకు వెళ్లి సంఘీభావం సైతం తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తూ.. Vizag steel plant ను ప్రయివేటీకరించ వద్దని కేంద్రాన్ని కోరారు. జగన్ ప్రభుత్వం సైతం కేంద్రానికి లేఖ రాసింది. ఈ నిర్ణయం మార్చుకోవాలని లేఖలో కోరింది. రాష్ట్రమంతా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంటే, ఇటీవల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో ముందుకు నడుస్తుంటే కేంద్రం మాత్రం Vizag steel plant ప్రయివేటీకరణకు నిర్ణయంలో మార్పు లేదంటూ స్పష్టం చేసింది. Vizag steel plant ప్రయివేటీకరణ బదులుగా స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేశించాల్సిన అవరాన్ని సీఎం జగన్ పేర్కొన్నారు.