వైఎస్ జగన్ పుట్టినరోజును ఇలా జరుపుకొండి...: వైసిపి శ్రేణులకు సజ్జల పిలుపు

Arun Kumar P   | Asianet News
Published : Dec 16, 2021, 01:46 PM ISTUpdated : Dec 16, 2021, 01:52 PM IST
వైఎస్ జగన్ పుట్టినరోజును ఇలా జరుపుకొండి...: వైసిపి శ్రేణులకు సజ్జల పిలుపు

సారాంశం

డిసెంబర్ 21వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేపట్టాలని వైసిపి శ్రేణులకు వైసిపి సీనియర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు (ys jagan birthday) వేడుకలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (ysrcp) సిద్దమవుతోంది. డిసెంబర్ 21న జగన్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని వైసిపి నిర్ణయించింది. ఈ మేరకు ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించాలో వైసిపి సీనియర్ నాయకులు సజ్జల రామ‌కృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) వైసిపి శ్రేణులకు సూచించారు. 

ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడులకలను విద్యార్థులు, నిరుపేదలతో జరుపుకోవాలని వైసిపి పిలుపునిచ్చింది. విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, నిరుపేదలకు దుస్తుల పంపిణీ, అన్నదానం, రక్తదానం వంటి కార్యక్రమాలను జరపాలని సూచించారు. అలాగే పర్యావరణాన్ని కాపాడేలా మొక్కలు కూడా నాటాలని వైసిపి శ్రేణులకు సజ్జల పిలుపునిచ్చారు. 

అదిష్టానం పిలుపుతో డిసెంబర్ 21న వైసిపి శ్రేణులు సమాజానికే కాదు పర్యావరణానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్దమయ్యారు. భారీ ఎత్తున రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇలా తమ ప్రియతమ నాయకుడు జగన్ పుట్టినజరోజులు ఘనంగా జరిపేందుకు వైసిపి సిద్దమవుతోంది. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్