జూడాల సమ్మె.. స్టైఫండ్ 45 వేల నుంచి రూ.70 వేలకు పెంపు: ఏకే సింఘాల్

By Siva KodatiFirst Published Jun 2, 2021, 7:07 PM IST
Highlights

జూడాల డిమాండ్లపై ప్రభుత్వం చర్చిస్తోందన్నారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఏకే సింఘాల్. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా విధుల్లో 350 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు పాల్గొంటున్నారని సింఘాల్ పేర్కొన్నారు. 

జూడాల డిమాండ్లపై ప్రభుత్వం చర్చిస్తోందన్నారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఏకే సింఘాల్. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా విధుల్లో 350 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు పాల్గొంటున్నారని సింఘాల్ పేర్కొన్నారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్ రూ.45 వేల నుంచి రూ.70 వేలకు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. ఏపీలో పాజిటివిటీ రేటు 13.02 శాతంగా వుందని.. గడిచిన 24 గంటల్లో 443ల టన్నుల ఆక్సిజన్ వినియోగించామని సింఘాల్ స్పష్టం చేశారు. 25 లక్షల మందికి పైగా రెండు డోసులు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. 50 లక్షల మందికి పైగా మొదటి డోస్ పూర్తయ్యిందని... విదేశాలకు వెళ్లే విద్యార్ధులకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యం కల్పిస్తామని సింఘాల్ తెలిపారు. 

Also Read:=ఏపీలో కరోనా తగ్గుముఖం: మరణాల్లో జోరు.. ప.గోకు ఊరట, చిత్తూరులో భయానకం

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు ఇవాళ మళ్లీ పెరిగాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న కేసులు.. ఇవాళ స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 12,768 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 17,17,156కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 98 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 11,132కి చేరుకుంది.

click me!