విమర్శలు చేస్తున్నారు కానీ.. కనీసం ఒక్క సలహా ఇచ్చారా: చంద్రబాబుపై ఆళ్ల నాని ఫైర్

By Siva KodatiFirst Published Apr 28, 2021, 3:36 PM IST
Highlights

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు గాను అనుసరించాల్సిన చర్యలపై చర్చించేందుకు గాను ఏపీ కేబినెట్ సబ్ కమిటీ బుధవారం మరోసారి సమావేశమైంది. భేటీ అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మీడియాకు వివరాలు తెలిపారు.

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు గాను అనుసరించాల్సిన చర్యలపై చర్చించేందుకు గాను ఏపీ కేబినెట్ సబ్ కమిటీ బుధవారం మరోసారి సమావేశమైంది. భేటీ అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మీడియాకు వివరాలు తెలిపారు.

కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని నాని తెలిపారు. కరోనా కేసులు పెరిగే కొద్ది బెడ్స్‌కు డిమాండ్ పెరుగుతోందని మంత్రి వెల్లడించారు. 33 వేలకు పైగా కోవిడ్ సెంటర్స్‌లో బెడ్స్ ఏర్పాటు చేస్తామని ఆళ్ల నాని పేర్కొన్నారు.

బెడ్స్, ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని... ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేసేందుకే పరిమితమయ్యారని ఆళ్ల నాని ఆరోపించారు.

Also Read:కుంభమేళా, ఎన్నికలతోనే సెకండ్ వేవ్.. ఈ సమయంలో పరీక్షలా? కేఏ పాల్ సంచలనం..

సంక్షోభ సమయంలో కూడా రాజకీయాలు చేస్తున్నారని... ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. రెమ్‌డిసివర్ ఇంజెక్షన్ల కొరత లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు.

చంద్రబాబు ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని ఆళ్ల నాని హితవు పలికారు. ప్రజలకు ఉపయోగపడే ఒక్క సూచన అయినా ఇచ్చారా అని ఆయన నిలదీశారు. తప్పుడు ప్రచారాన్ని ప్రజలు ఎట్టి పరిస్ధితుల్లోనూ నమ్మవద్దని ఆళ్ల నాని విజ్ఞప్తి చేశారు. 
 

 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona

click me!