కుంభమేళా, ఎన్నికలతోనే సెకండ్ వేవ్.. ఈ సమయంలో పరీక్షలా? కేఏ పాల్ సంచలనం..

By AN TeluguFirst Published Apr 28, 2021, 3:05 PM IST
Highlights

ఏపీ లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోందని కే ఏ పాల్ ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న విశాఖలో ఏడాది పాప కరోనాతో ఆక్సిజన్ అందక చనిపోవడం బాధాకరం అన్నారు.

ఏపీ లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోందని కే ఏ పాల్ ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న విశాఖలో ఏడాది పాప కరోనాతో ఆక్సిజన్ అందక చనిపోవడం బాధాకరం అన్నారు. 

కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ఏపీ లో టెన్త్,ఇంటర్ పరీక్షలు నిర్వహించడం అవివేకం అని ప్రభుత్వంపై మండిపడ్డారు. 

కరోనా సోకితే విద్యార్థుల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రశ్నించారు. కరోనా నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా వేశారు. అందుకే ఆంధ్రప్రదేశ్ లోనూ పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాను అన్నారు. 

ముఖ్యమంత్రి జగన్ ఇటువంటి పరిస్థితులలో తన పిల్లలను పరీక్షలకు పంపుతారా? మంత్రులు పంపుతారా? మీ పిల్లలవే ప్రాణాలా? అని ప్రశ్నించారు. 

కరోనా సునామీ కన్నా ప్రమాదకరంగా మారింది. దేశంలో ఎన్నో లక్షలమంది  ప్రాణాలు కోల్పోయారు. కుంభమేళా జరపడం వల్లే కరోనా ఉధృతకు దారితీసింది. దీనికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి అన్నారు. ఎన్నికల సమయాల్లో బహిరంగ సభలు,సమావేశాలు ఏర్పాటు చేసి కరోనా ప్రభలడానికి రాజకీయ నేతలు,ఎన్నికల సంఘమే కారణం అన్నారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మడం పై హైకోర్టులో పిటిషన్ వేశానని,  విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా అడ్డుకుంటామని అన్నారు. రెండు నెలలుగా ఎన్నో రాష్ట్రాలు తిరిగాను, ఎందరో ముఖ్యమంత్రులను కలిశాను. దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి అన్నారు.

ఏపీ కి ఆక్సిజన్,వాక్సిన్,కిట్లు పంపించాలని పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను,విదేశీ నేతలను కోరానని చెప్పుకొచ్చారు. ఏపీ హైకోర్టు పరీక్షలపై నిర్ణయం తీసుకోకుంటే విద్యార్థులు కరోనాకు బలైపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. 

ఇపుడు రాష్ట్రంలో కావాల్సింది రాజకీయ పోటీ, ఫైటింగ్ కాదు..ప్రజలు,విద్యార్థుల ప్రాణాలు ముఖ్యం. కరోనా ఆస్పత్రి కోసం ముఖ్యమంత్రి జగన్ ను నా బిల్డింగ్ లు వాడుకోమన్నాను. 1000 బెడ్లు ఇస్తాను అన్నాను. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ విద్యార్థుల భవిష్యత్,ప్రాణాలు గురించి ఆలోచించాలని హితవు పలికారు. 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona
 

click me!