gudivada amarnath : గుజరాత్ తర్వాత ఏపీకే అత్యధిక పెట్టుబడులు - మంత్రి గుడివాడ అమర్ నాథ్

By Asianet News  |  First Published Nov 16, 2023, 12:05 PM IST

దావోస్ లో జరిగిన ఒప్పందాలు కార్యరూపం దాల్చుతున్నాయని ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. పారిశ్రామిక హబ్ గా ఏపీని తయారు చేశామని తెలిపారు. అందుకే అన్ని సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయని అన్నారు. గుజరాత్ కంటే ఏపీకే ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు.


దేశంలో గుజరాత్ తరువాత ఏపీకే అత్యధిక పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. బిజినెస్ రిసోర్స్ యాక్షన్ ప్లాన్, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లు లో 350 అంశాలు పరిగణనలోకి తీసుకుని ర్యాంకు ఇచ్చాయని, అందులో నెంబర్ వన్ స్థానంలో ఏపీ ఉందని అన్నారు. బుధవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఏపీ ప్రభుత్వం ఏదో సంస్థకు ఉచితంగా భూములు ఇచ్చేస్తోందని నాదెండ్ల మనోహర్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అమర్ నాథ్ తెలిపారు. ఆయన చంద్రబాబు నాయుడు ఇచ్చి న స్క్రిప్ట్ ను చదువుతున్నారని ఆరోపించారు. స్కూల్ బ్యాగ్ లు, పరిశ్రమలు గురించి తప్పు గా మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలతో తమకేంటి సంబంధం అని ప్రశ్నించారు. 

Latest Videos

ఏపీలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. 2022-23 లో ఏపీ 11.43 శాతం జీఎస్ డీపీ గ్రోత్ రేటుతో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని అన్నారు. అయితే దేశ వృద్ధి రేటు 8 శాతం ఉందని అన్నారు. రాష్ట్రంలో 2019లో తలసరి ఆదాయం 17వ స్థానంలో ఉంటే ఇప్పుడు 9వ స్థానంలో ఉందని తెలిపారు.

అలాగే వ్యవసాయంలో 2019లో 27వ స్థానంలో ఏపీ ఉందని, ఇప్పుడు 6వ స్థానానికి చేరుకుందని అమర్ నాథ్ చెప్పారు. పరిశ్రమలు వృద్ధిలో  2019 లో 22వ స్థానంలో ఉంటే 2022 రిపోర్ట్ ప్రకారం 3 వ స్థానంలో ఉందని తెలిపారు. గుజరాత్ తర్వాత ఏపీ కే అత్యధిక పెట్టు బడులు వస్తున్నాయని చెప్పారు. పారిశ్రామిక హబ్ గా ఏపీని తయారు చేశామని, అందుకే అన్ని సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు. 

గ్లోబల్ సమ్మిట్ లో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిలు వచ్చాయని ఆయన అన్నారు. ప్రతిష్టాత్మకంగా పోర్టులు నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రతీ యాబై కిలో మీటర్ల కి ఒక యాక్టవిటీ వుండాలి అనే ఆలోచన తో ఫిషింగ్ హార్బర్ లు, ఫిష్ ల్యాండింగ్ నిర్మాణం జరుగుతోందని తెలిపారు.
దేశ వ్యాప్తంగా 11 ఇండస్ట్రీ కారిడార్ లు ఉండగా.. అందులో ఏపీలోనే మూడు ఉన్నాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న రూ. 2950 కోట్ల పరిశ్రమలు రాయితీలు చెల్లించామని తెలిపారు. దావోస్ లో జరిగిన ఒప్పందాలు కార్యరూపం దాల్చుతున్నాయని చెప్పారు.

click me!