నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో 14 వేల పోస్టుల భర్తీ

Siva Kodati |  
Published : Jan 22, 2023, 03:46 PM IST
నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో 14 వేల పోస్టుల భర్తీ

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. త్వరలోనే భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు సిద్ధమైంది. 2019 జూలై అక్టోబర్ మధ్య తొలి విడత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. త్వరలోనే భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలలో ఖాళీగా వున్న 14 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. త్వరలో నోటిఫికేషన్ జారీ చేయడానికి జగన్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నియామక ప్రక్రియలో భాగంగా ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఫిబ్రవరిలో 14,523 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడే అవకాశం వుంది. ఇదిలావుండగా జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. 2019 జూలై అక్టోబర్ మధ్య తొలి విడత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ
Andhra Pradesh: ఏపీలో క‌ర్నూల్ త‌రహా మరో రోడ్డు ప్ర‌మాదం.. అగ్నికి ఆహుతైన‌ ప్రైవేటు బ‌స్సు