బాబు 12 గంటల దీక్ష... రూ.10 కోట్లు ఖర్చు: మండిపడుతున్న ప్రతిపక్షాలు

By Siva KodatiFirst Published Feb 13, 2019, 2:08 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చేసిన ధర్మ పోరాట దీక్షకు విచ్చలవిడిగా ప్రజాధనం ఖర్చు చేయడం వివాదాస్పదమవుతోంది. ఢిల్లీ ఏపీ భవన్ వేదికగా సీఎం చేపట్టిన దీక్షకు కోట్లు ఖర్చు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చేసిన ధర్మ పోరాట దీక్షకు విచ్చలవిడిగా ప్రజాధనం ఖర్చు చేయడం వివాదాస్పదమవుతోంది. ఢిల్లీ ఏపీ భవన్ వేదికగా సీఎం చేపట్టిన దీక్షకు కోట్లు ఖర్చు చేశారు.

12 గంటల దీక్ష కోసం అక్షరాల రూ.10 కోట్ల రూపాయల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. కార్యకర్తలు, నేతలు, విద్యార్ధలు, ఇతర ప్రజాసంఘాలు ఏపీ నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు గాను రెండు ప్రత్యేక రైళ్లను బుక్ చేశారు. వీటి అద్దె రూ. కోటి 12 లక్షలు. అంతేకాకుండా ఢిల్లీలో వీరందరి బస కోసం పెద్ద ఎత్తున హోటళ్లలో రూంలను కూడా బుక్ చేశారు.

అధికారిక లెక్కల ప్రకారం దేశ రాజధానిలో సుమారు 1100 రూమ్‌లను బుక్ చేశారు. అక్కడి నుంచి కార్యకర్తలను దీక్షా వేదిక వద్దకు తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. వీటికి భోజనం ఖర్చులు అదనం, వీటన్నింటికి అక్షరాల 10 కోట్లను రాష్ట్ర ఖజానా నుంచి విడుదల చేశారు. పార్టీ కార్యక్రమానికి ప్రజాధనాన్ని ఖర్చు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. బీజేపీ, వైసీపీ వంటి ప్రతిపక్షాలు చంద్రబాబు ఖర్చుపై విమర్శలు చేస్తున్నాయి. 

ఇదిలా ఉంటే ఈ దీక్షకు ఏపీ ప్రభుత్వం రూ.10 కోట్లను విడుదల చేసింది. అయితే దీక్షకు కేవలం రూ.2.83 లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.ఈ విషయమై కేబినెట్ లో కూడ బాబు మంత్రులతో చర్చించారు. విపక్షాలు ఈ విషయమై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

click me!