విశాఖ ఎయిర్‌పోర్టులో మంత్రులపై దాడి : ప్రభుత్వం సీరియస్.. ఇద్దరు పోలీస్ అధికారులపై వేటు

By Siva KodatiFirst Published Oct 18, 2022, 7:08 PM IST
Highlights

వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన దాడికి సంబంధించి పోలీస్ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా ఎయిర్‌పోర్ట్ సీఐ ఉమాకాంత్, కంచరపాలెం సీఐ కృష్ణారావులపై వేటు వేశారు ఉన్నతాధికారులు. 

గత శనివారం విశాఖపట్నంలో జరిగిన విశాఖ గర్జన సభలో పాల్గొని తిరిగి వస్తున్న మంత్రులు జోగి రమేశ్, రోజా, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలపై వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన దాడికి సంబంధించి పోలీస్ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా ఎయిర్‌పోర్ట్ సీఐ ఉమాకాంత్, కంచరపాలెం సీఐ కృష్ణారావులపై వేటు వేశారు ఉన్నతాధికారులు. వీరిద్దరిని వీఆర్‌కు సరెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇకపోతే.. విశాఖ విమానాశ్రయం వద్ద ఏపీ మంత్రులపై దాడి ఘటనలో అరెస్టైన జనసేన నాయకులు, కార్యకర్తలకు న్యాయస్థానంలో ఊరట లభించిన సంగతి తెలిసిందే. అరెస్టైన  61 మందిని రూ. పదివేల పూచీకత్తుపై కోర్టు వారిని విడుదల చేసింది. మరో తొమ్మిదిమందికి ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. తొమ్మిది మందిపై 307 సెక్షన్ తొలగించి 326 సెక్షన్ గా మార్చి రిమాండ్ విధించారు. అంతకు ముందు  హైడ్రామా మధ్య  పోలీసులు జనసేన నేతలను ఏడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. 

ALso REad:మమ్మల్నిచంపాలనే ఉద్దేశ్యంతో విశాఖలో దాడి:జనసేనపై మంత్రి రోజా ఫైర్

వారిని కోర్టుకు తీసుకు వచ్చే సమయంలో ప్రాంగణం అన్ని గేట్లు దిగ్బంధం చేశారు మరోవైపు 92 మంది జనసైనికులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు జనసేన లీగల్ సెల్ పేర్కొంది. అరెస్టు చేసిన వారిలో 9 మంది పార్టీ నేతలకు రిమాండ్ విధించారని, 61మంది జనసైనికులకు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు జనసేన తెలిపింది.
 

click me!