ఏపీ: రేపు టెన్త్ ఫలితాలు విడుదల

By Siva Kodati  |  First Published Aug 5, 2021, 5:34 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో రేపు టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు


ఆంధ్రప్రదేశ్‌లో రేపు టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. కరోనా కారణంగా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. హైపవర్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా విద్యార్ధులకు ప్రభుత్వం గ్రేడ్లను కేటాయించింది. www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో మార్కులు వుంచినట్లు విద్యాశాఖ తెలిపింది. 

కాగా, రాష్ట్రంలో టెన్త్ పరీక్షలను వాయిదా వేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. ఉపాధ్యాయులకు కరోనా వ్యాక్సినేషన్ పూర్తైన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ నిర్వహించింది. ఈ విషయమై విచారణ సందర్భంగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. 

Latest Videos

ఈ ఏడాది జూన్ 7వ తేదీ నుండి  రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇతర రాష్ట్రాలు టెన్త్ పరీక్షలను రద్దు చేశాయి. కొన్ని రాష్ట్రాలు వాయిదా వేశాయి. అయితే  టెన్త్, ఇంటర్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారంగా నిర్వహిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది.అయితే రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. కొన్ని పాఠశాలలను క్వారంటైన్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. దీంతో పరీక్షల నిర్వహణ కష్టంగా మారింది. ఈ తరుణంలో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదనే అభిప్రాయంతో విద్యశాఖాధికారులున్నారు. ఇదే విషయాన్ని హైకోర్టుకు తెలిపారు.  

click me!