ఏపీలో అన్‌లాక్ 5.0 నిబంధనలు ఇవే...!!!

Siva Kodati |  
Published : Oct 09, 2020, 03:59 PM IST
ఏపీలో అన్‌లాక్ 5.0 నిబంధనలు ఇవే...!!!

సారాంశం

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దేశంలో పాజిటివ్ కేసుల కంటే రికవరీలు పెరుగుతుండటంతో భారత ప్రభుత్వం దశల వారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తూ వస్తోంది

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దేశంలో పాజిటివ్ కేసుల కంటే రికవరీలు పెరుగుతుండటంతో భారత ప్రభుత్వం దశల వారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తూ వస్తోంది.

తాజాగా ఆన్‌లాక్‌ 5 మార్గదర్శకాలను ప్రకటించడంతో.. కరోనా నుంచి ప్రజల జీవన విధానం సాధారణ స్థితికి వచ్చింది. దాదాపు అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్నాయి. అక్టోబర్‌ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా అన్‌లాక్‌ 5.0 గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది.

అన్‌లాక్ 5.0 నిబంధనాలు ఇవే : 

* రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు, భౌతికదూరం తప్పనిసరి 
* సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్, షాపుల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయాలి. మాస్క్ లేకపోతే నో ఎంట్రీ
* ప్రజారవాణాలో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి
* ప్రార్థనా మందిరాల్లో కూడా కోవిడ్ నిబంధనలు పాటించేలి
* కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి
* బస్టాండ్, రైల్వేస్టేషన్లలో మాస్క్‌లు ధరించేలా ప్రచారం , మైక్ అనౌన్స్‌మెంట్‌
* సినిమా హాల్స్‌లో కోవిడ్ నిబంధనలపై టెలీ ఫిల్మ్ ప్రదర్శనలు
* స్కూళ్లు, విద్యా సంస్థలు, పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహించే చోట కేంద్ర మార్గదర్శకాలు తప్పనిసరి
* విద్యార్థులు, అధ్యాపకులు ప్రతి పీరియడ్ తర్వాత శానిటైజేషన్ చేసుకునేలా యాజమాన్యాలు ఏర్పాటు చేయాలి

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్