ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు: జగన్ కీలక ఆదేశాలు

Siva Kodati |  
Published : Oct 09, 2020, 03:32 PM IST
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు: జగన్ కీలక ఆదేశాలు

సారాంశం

ఆరోగ్యశ్రీ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌-19 నివారణ చర్యలపై సమీక్ష జరిపారు.

ఆరోగ్యశ్రీ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌-19 నివారణ చర్యలపై సమీక్ష జరిపారు.

ఆరోగ్యశ్రీ ఆస్పత్రులన్నింటిలో ఆరోగ్యమిత్రలను తప్పనిసరిగా నియమించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో వైద్య సేవలు, సదుపాయాలకు ఇక నుంచి గ్రేడింగ్‌ విధానం అమలు చేయాలని.. 15 రోజుల్లోగా ఈ ప్రక్రియ అంతా పూర్తి కావాలని సూచించారు.  

ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, వైద్యుల అందుబాటు, ప్రమాణాలతో కూడిన ఔషధాలు, శానిటేషన్‌, నాణ్యతతో కూడిన ఆహారం, ఆరోగ్యమిత్రలు ఈ ఆరు ప్రమాణాలు ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కచ్చితంగా అమలవ్వాలన్నారు.

అన్ని కోవిడ్‌ ఆస్పత్రుల్లోనూ ఇవే ప్రమాణాలు పాటించాలని సీఎం ఆదేశించారు. రోగులకు ఆరోగ్య మిత్రలు పూర్తి స్థాయిలో సేవలందించాలని.. 104 కాల్‌ సెంటర్‌ మరింత సమర్థంగా పని చేయాలన్నారు.

అధికారులు ఈ కాల్ సెంటర్ పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలని జగన్ కోరారు. ప్రతి రోజూ తప్పనిసరిగా మాక్‌ కాల్స్‌ చేయాలని అధికారులకు సూచించారు.

ఫోన్‌ చేసిన అర గంటలో బెడ్ల కేటాయింపు జరగాలని.. హోం ఐసొలేషన్‌లో ఉన్న వారికి మెడికల్‌ కిట్లు జగన్‌ స్పష్టం చేశారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్ నీలంసాహ్ని, డీజీపీ సవాంగ్‌ తదతర అధికారులు హాజరయ్యారు

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!