ఆటో డ్రైవర్లకు జగన్ సర్కార్ ఆర్ధిక సాయం: మార్గదర్శకాలు ఇవే

By Siva KodatiFirst Published Sep 9, 2019, 1:50 PM IST
Highlights

ఆటో రిక్షా డ్రైవర్లతో పాటు ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ.10 వేల ఆర్ధిక సాయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. లబ్ధిదారుల ఎంపిక, అర్హత తదితర అంశాలను ఈ ఉత్తర్వుల్లో పొందుపరిచింది. మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 

ఆటోడ్రైవర్లకు ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తదితర అవసరాల కోసం ఆర్ధిక సాయం అందించాలని జగన్ ఎన్నికల ప్రచారంలో హమీ ఇచ్చారు. ఈ పథకానికి సంబంధించి ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. 

మార్గదర్శాలు ఇవే

* దరఖాస్తుదారుడు సొంత ఆటో కలిగి, నడుపుతూ ఉండాలి
* వాహనానికి సంబంధించిన అన్ని రికార్డులు తప్పనిసరి
* దరఖాస్తుదారుడికి తెల్లరేషన్ కార్దు, ఆధార్ కార్డు తప్పనిసరి
* కుటుంబంలో ఇద్దరు డ్రైవర్లు ఉంటే ఒక్కరికే ఆర్ధిక సాయం

click me!