74ఏళ్ల బామ్మకు డెలివరీ.. హాస్పిటల్ సంచలన నిర్ణయం

Published : Sep 09, 2019, 11:11 AM IST
74ఏళ్ల బామ్మకు డెలివరీ.. హాస్పిటల్ సంచలన నిర్ణయం

సారాంశం

తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మ దంపతులకు ఐవీఎప్ విధానంలో సంతాన భాగ్యం కలిగింది. వీరికి 1962లో వివాహం కాగా, ఏళ్ల తరబడి హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా పిల్లలు కలగలేదు. వయసు మీదపడినా మంగాయమ్మకు మాత్రం తల్లి కావాలని కోరిక బలంగా ఉండేది. 

74ఏళ్ల వయసులో ఇటీవల ఓ బామ్మ... కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఆ వయసులో ఆమె ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చిందుకు పలువురు సంతోషం వ్యక్తం చేయగా... ఈ వయసులో ఆమెకు డెలివరీ ఎలా చేస్తారంటూ పలువురు విమర్శలు గుప్పించారు. ఆ వయసు మహిళకు ఐవీఎఫ్ విధానం ఎలా చేస్తారంటూ పలువురు వైద్యులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మంగాయమ్మకు డెలివరీ చేసిన హాస్పిటల్ తాజాగా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

నిజానికి..అసిస్టెడ్‌ రీప్రొడెక్టివ్‌ టెక్నాలజీ (రెగ్యులేషన్‌) బిల్లు-2017 ప్రకారం 18 ఏళ్ల లోపు.. 45 ఏళ్ల పైబడిన వారికి ఈ చికిత్స అందించడం నిషేధం. దానిని పట్టించుకోకుండా గుంటూరులోని అహల్యా ఆస్పత్రికి ఆమెకు ఐవీఎఫ్ విధానం చేశారు. కాగా... తాజాగా ఈ విషయంలో విమర్శలు ఎక్కువకావడంతో హాస్పిటల్ ఓ ప్రకటన చేసింది. ఐవీఎఫ్‌ విధానానికి 45 ఏళ్లుపైబడి భార్య, 50 ఏళ్లు పైబడిన భర్తలను సెప్టెంబరు 2019 తీసుకోబోమని పేర్కొంది. ఏఆర్‌టీ బిల్లు ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో తెలిపింది.

తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మ దంపతులకు ఐవీఎప్ విధానంలో సంతాన భాగ్యం కలిగింది. వీరికి 1962లో వివాహం కాగా, ఏళ్ల తరబడి హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా పిల్లలు కలగలేదు. వయసు మీదపడినా మంగాయమ్మకు మాత్రం తల్లి కావాలని కోరిక బలంగా ఉండేది. వారికి తెలిసిన ఓ మహిళ 55 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ విధానంలో బిడ్డకు జన్మనివ్వడంతో మంగాయమ్మలో ఆశలు చిగురించాయి. గతేడాది నవంబర్‌లో గుంటూరులోని అహల్య హాస్పిట‌ల్‌ను సంప్రదించారు. ఐవీఎఫ్‌ నిపుణులైన డాక్టర్‌ శనక్కాయల ఉమాశంకర్‌ మంగాయమ్మన పరీక్షించారు.

ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోవడంతో... ఐవీఎఫ్ విధానం చేశారు. మరో స్త్రీ అండం, ఆమె భర్త వీర్యంతో ఈ విధానం చేశారు. కాగా.. ఇటీవల ఆమె ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డలు ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారు. 

related news

ఈ వయసులో పిల్లలు ఎంత వరకు కరెక్ట్..?

గుంటూరులో కవలలకు జన్మనిచ్చిన 74 ఏళ్ల బామ్మ

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే