జగన్‌పై దాడి కేసు: ఎన్ఐఏ విచారణను నిలిపివేయాలంటూ ఏపీ సర్కార్ పిటిషన్

By sivanagaprasad kodatiFirst Published Jan 18, 2019, 10:26 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి ఘటన కేసును ఎన్ఐఏకే అప్పగించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. 

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి ఘటన కేసును ఎన్ఐఏకే అప్పగించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం న్యాయపోరాటానికి దిగింది.

నిందితుడు శ్రీనివాసరావు ఎన్‌ఐఏ కస్టడి గడువు నేటితో ముగియనుండటంతో విచారణను నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. రాష్ట్రాల హక్కుల్లో కేంద్రం తలదూర్చుతుందంటూ ప్రభుత్వం మండిపడుతోంది.

కాగా, ఏపీ పోలీసులు తమకు సహకరించడం లేదని కేసు రికార్డులు, సీజ్ చేసి సాక్ష్యాధారాలు ఇవ్వడం లేదంటూ ఎన్ఐఏ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నిందితుడు శ్రీనివాసరావును విశాఖ లేదా రాజమండ్రి తరలించాలని ఏపీ పోలీసులు, ఎన్ఐఏ విచారణను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్లు వేయడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేకిత్తిస్తోంది. 
 

click me!