స్కిల్ డెవలప్‌మెంట్‌లో రూ.241 కోట్ల స్కామ్.. చంద్రబాబుదే బాధ్యత: చల్లా మధు

By Siva Kodati  |  First Published Jul 13, 2021, 7:33 PM IST

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌లో రూ.241 కోట్లను షెల్ కంపెనీలకు బదిలీ చేసినట్లు తేలిందన్నారు చల్లా మధు. అది కేబినెట్ నిర్ణయం కనుక చంద్రబాబే బాధ్యత వహించాలని మధు డిమాండ్ చేస్తున్నారు. 


ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌కు సంబంధించి గత టీడీపీ ప్రభుత్వంలో భారీగా అవకతవకలు జరిగినట్లుగా గుర్తించారు అధికారులు. నిరుద్యోగ యువతకు అడ్వాన్స్ టెక్నాలజీ ఇస్తామంటూ గత ప్రభుత్వం సిమెన్స్ ప్రాజెక్ట్ చేపట్టింది. అయితే అందులో కుంభకోణం జరిగినట్లు ఫోరెన్సిక్ ఆడిట్‌లో నిర్థారణ అయ్యిందంటున్నారు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ చల్లా మధు. మొత్తం ప్రాజెక్ట్‌లో రూ.241 కోట్లను షెల్ కంపెనీలకు బదిలీ చేసినట్లు తేలిందన్నారు. అది కేబినెట్ నిర్ణయం కనుక చంద్రబాబే బాధ్యత వహించాలని మధు డిమాండ్ చేస్తున్నారు. సీఐడీ విచారణలో అధికారులు, నాయకుల పేర్లు బయటకు వస్తాయని చల్లా మధు స్పష్టం చేశారు. 

click me!