ఏపీ పీఆర్‌సీపై ఉత్కంఠ : జగన్ మనసులో ఏముందో.. కాసేపట్లో సజ్జలతో ఉద్యోగ సంఘాల భేటీ

Siva Kodati |  
Published : Dec 14, 2021, 02:58 PM IST
ఏపీ పీఆర్‌సీపై ఉత్కంఠ : జగన్ మనసులో ఏముందో.. కాసేపట్లో సజ్జలతో ఉద్యోగ సంఘాల భేటీ

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ‌ ప్రకటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాసేపట్లో ఉద్యోగ సంఘాలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ కానున్నారు. సీఎం జగన్‌కు సీఎస్ నేతృత్వంలోని కమిటీ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ‌ ప్రకటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాసేపట్లో ఉద్యోగ సంఘాలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ కానున్నారు. సీఎం జగన్‌కు సీఎస్ నేతృత్వంలోని కమిటీ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జగన్ మనసులో ఏముంది..? ఫిట్‌మెంట్ 30 శాతమైనా దాటుతుందా..? అన్న ఆందోళనలో వున్నారు.

కేవలం 14 శాతం మాత్రమే ఫిట్‌మెంట్ సిఫారసు చేసింది సీఎస్ కమిటీ. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. ఫిట్‌మెంట్ విషయంలో కేంద్రాన్ని, ఇంటి అద్దె విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఫాలో అయినట్లుంది సీఎస్ కమిటీ. ఇంటి అద్దె విషయంలో గణనీయంగా తగ్గించింది తెలంగాణ సర్కార్. జీహెచ్ఎంసీ పరిధిలో ఉద్యోగులకు హెచ్ఆర్ఏను 30 శాతం నుంచి 24 శాతానికి తగ్గించింది తెలంగాణ ప్రభుత్వం. 

Also Read:పీఆర్సీపై ఏపీ సీఎస్ కమిటీ నివేదిక: ఉద్యోగ సంఘాల అసంతృప్తి

అంతకుముందు prc పై సీఎస్ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ ఇచ్చిన నివేదికపై ఉద్యోగ సంఘాలు సోమవారం అసంతృప్తిని వ్యక్తం చేశాయి. అమరావతి ఉద్యోగుల జేఏసీ చైర్మెన్ Bopparaju  సహా Employees Union నేతలు సోమవారం నాడు రాత్రి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ స్కేల్ ను కమిటీ అధ్యయనం చేయలేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. Chief Secretary నేతృత్వంలోని కమిటీ సిఫారసులను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ప్రకటించారు.

తమ డిమాండ్లపై సీఎం Ys Jagan చొరవ తీసుకొని పరిష్కరించాలని  వారు డిమాండ్ చేశారు. ఈ నివేదికపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాల నేతలు ఓ కమిటీని ఏర్పాటు చేసుకొన్నట్టుగా తెలిపారు. సీఎంతోనే  ఈ విషయమై చర్చిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. Sameer Sharma కమిటీ సిఫారసుల ప్రకారంగా తమకు పెద్దగా ఉపయోగం లేదని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. తమ డిమాండ్ల సాధనకు సీఎం పెద్ద మనసు చేసుకోవాలని వారు కోరారు. 11వ వేతన సంఘం సిఫారసుల్లో కొన్నింటిని సీఎస్ కమిటీ పక్కన పెట్టిందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్