MLA Roja: నాలుగు గంటలుగా విమానం డోర్లు తెరవడం లేదు.. ఇండిగోపై కేసు వేస్తానని రోజా వార్నింగ్

By Sumanth Kanukula  |  First Published Dec 14, 2021, 2:47 PM IST

వైసీపీ ఎమ్మెల్యే రోజా (MLA Roja) , టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు (Yanamala Rama Krishnudu) లతో పాటుగా దాదాపు 70 మంది ప్రయాణికులకు ఇండిగో సంస్థ చుక్కలు చూపెట్టింది. వారు ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో  దీంతో ఎమ్మెల్యే రోజా ఇండిగో సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 


వైసీపీ ఎమ్మెల్యే రోజా (MLA Roja) , టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు (Yanamala Rama Krishnudu) లతో పాటుగా దాదాపు 70 మంది ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న ఇండిగో (IndiGo) విమానాన్ని సాంకేతిక సమస్య తలెత్తడంతో దారి మళ్లించారు. సమస్యేమిటో చెప్పకుండా ప్రయాణికులకు ఆందోళనకు గురిచేశారు. అనంతరం తిరుపతిలో ల్యాండ్ కావాల్సిన విమానాన్ని దారి మళ్లించారు. చివరకు బెంగళూరులో విమానం సేఫ్ ల్యాండింగ్ అయింది. అయితే ఆ సమయంలో ఇండిగో సంస్థ ప్రయాణికులకు చుక్కలు చూపించింది. 

రాజమండ్రి నుంచి బయలుదేరిన ఇండిగో విమానం వాస్తవానికి తిరుపతిలో ఉదయం 10.20 గంటలకు చేరుకోవాల్సిన విమానం.. గంటల ఆలస్యంగా చేరింది. అయితే ల్యాండ్ కాకుండా.. గంట సేపు విమానాన్ని గాల్లోనే తిప్పారు. దీంతో ఎమ్మెల్యే రోజా, యనమల రామకృష్ణుడుతో సహా ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. విమాన సిబ్బంది వ్యవహరించిన తీరుపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యే రోజా కూడా తీవ్రంగా స్పందించారు. 

Latest Videos

undefined

Also read: ఎమ్మెల్యే రోజా ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. గాల్లోనే గంటపాటు చక్కర్లు..

ఇండిగో సిబ్బంది  సమస్యేమిటో చెప్పకుండా టెన్షన్ పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండిగో సంస్థ తమ జీవితాలతో ఇండిగో చెలగాటం ఆడిందని తెలిపారు. నాలుగు గంటలు విమానంలోనే కూర్చొబెట్టారని చెప్పారు. బెంగళూరులో ల్యాండ్ చేసి డోర్లు ఓపెన్ చేయకుండా మానసికంగా వేదనకు గురిచేశారని చెప్పారు. బెంగళూరులో దిగడానికి ఇండిగో సిబ్బంది రూ. 5వేలు అడిగినట్టుగా తెలిపారు.  ఇండిగోపై కోర్టులో కేసు వేస్తానని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఇంకా ఫ్లైట్‌లోనే ఉన్నట్టుగా తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. 

ఇక, ప్రస్తుతం విమానం బెంగళూరులో సురక్షితంగా దిగినట్టుగా రేణిగుంట ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి. సాంకేతిక సమస్యను సరిదిద్దడానికి కావాల్సిన మెకానిజం లేనందునే విమానాన్ని బెంగళూరుకు తరలించినట్టుగా వెల్లడించాయి. సమస్యను పరిష్కరించిన తర్వాత మిమానం రేణిగుంట చేరుకుంటుందని తెలిపాయి.

click me!