ఫిట్‌మెంట్ అంటే జీతాలు పెరగాలి.. తగ్గకూడదు, ఈ పీఆర్సీ అక్కర్లేదు: ఏపీ ఉద్యోగ సంఘాలు

Siva Kodati |  
Published : Jan 19, 2022, 05:40 PM IST
ఫిట్‌మెంట్ అంటే జీతాలు పెరగాలి.. తగ్గకూడదు, ఈ పీఆర్సీ అక్కర్లేదు: ఏపీ ఉద్యోగ సంఘాలు

సారాంశం

తమకు కొత్త పీఆర్సీ వద్దన్నారు ఏపీ ఉద్యోగ సంఘం నేత బండి శ్రీనివాసరావు (bandi srinivasa rao) . పీఆర్సీతో జీతం పెరుగుతుందని అబద్ధం చెబుతున్నారని ఆయన ఆరోపించారు. అధికారులు చెప్పిందే పదే పదే చెబుతున్నారని మండిపడ్డారు. జేఏసీ మీటింగ్ తర్వాత సీఎస్‌కు సమ్మె నోటీసులు ఇస్తామని బండి తెలిపారు. 

తమకు కొత్త పీఆర్సీ వద్దన్నారు ఏపీ ఉద్యోగ సంఘం నేత బండి శ్రీనివాసరావు (bandi srinivasa rao) . విజయవాడలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పీఆర్సీ వల్ల జీతాలు ముమ్మాటికీ తగ్గుతాయన్నారు. మూడు జీవోలను బేషరతుగా రద్దు చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పీఆర్సీతో జీతం పెరుగుతుందని అబద్ధం చెబుతున్నారని ఆయన ఆరోపించారు. అధికారులు చెప్పిందే పదే పదే చెబుతున్నారని మండిపడ్డారు. జేఏసీ మీటింగ్ తర్వాత సీఎస్‌కు సమ్మె నోటీసులు ఇస్తామని బండి తెలిపారు. కేంద్ర పే స్కేలును అమలు చేసే హక్కు ప్రభుత్వానికి లేదని.. జీవోలు రద్దు చేసే వరకు ప్రభుత్వంతో చర్చలకు వెళ్లే ప్రసక్తి లేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. 

డీఏలు ఇచ్చి జీతంలో సర్దుబాటు చేయడం ఉద్యోగులను మోసం చేయడమేనని ఆయన మండిపడ్డారు. సీఎస్ చెప్పిన లెక్కలన్నీ బోగస్సేనని బొప్పరాజు పేర్కొన్నారు. ఫిట్‌మెంట్ అంటే జీతాలు పెరగాలి కానీ తగ్గకూడదన్నారు. పీఆర్సీ సమయంలోనే డీఏ ఎందుకు ఇస్తున్నారని బొప్పరాజు ప్రశ్నించారు. డీఏలను చూపించి జీతం పెరిగినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారని.. తమకు పీఆర్సీ వద్దని, ఐఆర్ 27 శాతం ఇస్తే చాలని ఆయన స్పష్టం చేశారు. తాము దాచుకున్న డబ్బులను ఎక్కడికి డైవర్ట్ చేశారో చెప్పాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. తాము అంగీకరించకుండా సెంట్రల్ పే కమీషన్ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. తమ స్కేలు, ఐఏఎస్‌ల స్కేల్ వేరు వేరని బొప్పరాజు అన్నారు. 

మరోవైపు కొత్త PRC తో ఎవరి జీతాలు తగ్గవని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి Sameer Sharma స్పష్టం చేశారు. కరోనాతో రాష్ట్ర ఆదాయం పడిపోయిందని సమీర్ శర్మ తెలిపారు.Andhra pradesh రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మూడు  పీఆర్సీ జీవోలపై Employees  సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.ఈ జీవోలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాయి. 

ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు. గత పరిస్థితులకు  ఇప్పటికీ చాలా తేడా ఉందన్నారు. Corona లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 98 వేల  కోట్ల Incomeవచ్చేదన్నారు.కరోనా కారణంగా రాష్ట్రానికి ఆదాయం తగ్గిందని ఆయన చెప్పారు. ఆదాయాన్ని, ఖర్చులను బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుందన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఐఆర్ ఇచ్చామన్నారు.

కరోనా థర్డ్ వేవ్ వల్ల మరింత నష్టం జరిగే అవకాశం ఉందని సీఎస్ సమీర్ శర్మ అభిప్రాయపడ్డారు.  ఐఆర్ కంటే జీతంలో భాగం కాదన్నారు. పీఆర్సీ వల్ల గ్రాస్ శాలరీలో ఏ మాత్రం తగ్గదని సీఎస్ స్పష్టం చేశారు. హెచ్ఆర్ తగ్గందా? ;పెరిగిందా అనేది వేరే అంశమన్నారు. జీతాల్లో కోత మాత్రం పడే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు.ఐఎఎస్ లకు ఎక్కువ జీతాలు వస్తున్నాయనడం అవాస్తవమని సీఎస్  సమీర్ శర్మ తెలిపారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పీఆర్సీని ఫాలో అవుతున్నామన్నారు. 

 ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జీతాలనుపెంచుతున్నామన్నారు.ఉద్యోగుల retirement వయస్సును 62 ఏళ్లకు పెంచిన విషయాన్ని సీఎస్ గుర్తు చేశారు. పీఆర్సీలో ప్రతి అంశం సీఎం Ys Jagan కు తెలుసునని సీఎస్ వివరించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా ఎక్కువని కానీ పన్నుల నుండి వచ్చే ఆదాయం తక్కువ అని సీఎస్ చెప్పారు. ఐఆర్ తో రాష్ట్ర ఖజానాపై రూ. 17 వేల కోట్ల భారం పడిందని సీఎస్ చెప్పారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Speech: తిరుపతి వెడ్డింగ్ హబ్ గా తయారవుతుంది | Wedding Hub | Asianet News Telugu
Chandrababu: స్వర్ణ నారావారిపల్లెకు శ్రీకారం చుట్టాం.. జీవనప్రమాణాలు పెంచాలి | Asianet News Telugu