విశాఖలో కరోనా జోరు ఏపీలో మొత్తం కేసులు 21,27441కి చేరిక

By narsimha lodeFirst Published Jan 19, 2022, 5:14 PM IST
Highlights

గత 24 గంటల్లో41,713 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 10,057 మందికి  ఏపీలో కరోనా నిర్ధారణ అయింది. మొత్తం కేసులు 21,27441కి చేరాయని ప్రభుత్వం తెలిపింది.

అమరావతి:Andhra pradesh  రాష్ట్రంలో   గత 24 గంటల్లో  భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 10,057 corona కేసులు నమోదయ్యాయి.గత 24 గంటల్లో41,713 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 10,057  మందికి కరోనా నిర్ధారణ అయింది.  రాష్ట్రంలో కరోనా కేసులు 21,27441కి చేరుకొన్నాయి.కరోనాతో గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మరణించారు.  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 14,522కి చేరింది. 

గడిచిన 24 గంటల్లో 1222 మంది Corona నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 20లక్షల 67వేల 984 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 44,935 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

గత 24 గంటల్లో అనంతపురంలో861,చిత్తూరులో 1822, తూర్పుగోదావరిలో919,గుంటూరులో943,కడపలో 482, కృష్ణాలో332, కర్నూల్ లో452, నెల్లూరులో698, ప్రకాశంలో 716,విశాఖపట్టణంలో 1827,,శ్రీకాకుళంలో407, విజయనగరంలో 382,పశ్చిమగోదావరిలో 216కేసులు నమోదయ్యాయి.

కరోనాతో రాష్ట్రంలో గత 24 గంటల్లో ముగ్గురు మరణించారు. నెల్లూరు,శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున మృత్యువాత పడ్డారు.

ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,61,558, మరణాలు 1093
చిత్తూరు-2,59,462, మరణాలు1962
తూర్పుగోదావరి-2,98,544, మరణాలు 1290
గుంటూరు -1,83,664,మరణాలు 1261
కడప -1,18,139 మరణాలు 644
కృష్ణా -1,23,425,మరణాలు 1482
కర్నూల్ - 1,26,153,మరణాలు 854
నెల్లూరు -1,50,360,మరణాలు 1062
ప్రకాశం -1,41,022, మరణాలు 1131
శ్రీకాకుళం-1,26,501, మరణాలు 795
విశాఖపట్టణం -1,69,013 మరణాలు 1148
విజయనగరం -85,460, మరణాలు 674
పశ్చిమగోదావరి-1,81,245, మరణాలు 1126

 

: 19/01/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 21,24,546 పాజిటివ్ కేసు లకు గాను
*20,65,089 మంది డిశ్చార్జ్ కాగా
*14,522 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 44,935 pic.twitter.com/nTVqy7nWph

— ArogyaAndhra (@ArogyaAndhra)

 ఈ నెల 18వ తేదీ నుండి నైట్ కర్ఫ్యూను అమలు చేస్తోంది  ఏపీ ప్రభుత్వం..ఈ నెల 31వ తేదీ వరకు రాత్రి పూట కర్ఫ్యూను అమలు చేయనున్నారు. రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.

ఫార్మసీ దుకాణాలు, మీడియా సంస్థలు, టెలి కమ్యూనికేషన్లు, ఐటీ, విద్యుత్ సేవలు, పెట్రోల్ బంకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, సిబ్బంది, విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణీకులకు నైట్ కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇచ్చారు. 

నైట్ కర్ఫ్యూతో పాటు కరోనా ఆంక్షలను కూడా కఠినంగా అమలు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకపోతే రూ.10 నుండి రూ. 15 వేల వరకు ఫైన్ విధించనున్నారు.  షాపింగ్ మాల్స్, దుకాణాల వద్ద కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. సినిమా థియేటర్లో 50 శాతం ఆక్యుపెన్సీతో నడపాలని ఆదేశించింది. ఆర్టీసీ సహా ప్రజా రవాణా వ్యవస్థల్లో మాస్కులు తప్పనిసరి చేసింది జగన్ సర్కార్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా సంస్థలు ఈ నెల 17 నుండి యధావిధిగా ప్రారంభమయ్యాయి.

click me!